పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/109

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కరెన్సీ నోట్లను లేక బ్యాంకు నోట్లను పోలియుండు దస్తావేజులను రూపొందించుట లేక ఉపయోగించుట.

489-ఈ-(1) ఏదేని కరెన్సీ నోటుగ, లేక - బ్యాంకు నోటుగ తాత్పర్యమిచ్చునట్టి లేదా ఏదేని విధముగ దానిని పోలియుండునట్టి, లేదా మోసగించుటకు వీలు కలిగించునట్లుగా దానిని పోలియుండునట్టి ఏదేని దస్తా వేజును రూపొందించు, లేక రూపొందింపజేయు, లేక ఏ ప్రయోజనము కొరకైనను ఉపయోగించు, లేక ఏ వ్యక్తి కైనను అందజేయు వారెవరైనను, వందరూపాయలదాక ఉండగల జుర్మానాతో శిక్షింపబడుదురు.

(2) ఏ దస్తా వేజును రూపొందించుట ఉపపరిచ్ఛేదము (1) క్రింద అపరాధమై యున్నదో ఆ దస్తావేజు పై ఏ వ్యక్తి యొక్క పేరైనను ఉన్నచో, అట్టి వ్యక్తి ఎవరైనను, ఏ వ్యక్తి చే అది ముద్రింపబడినదో అన్యధా రూపొందింపబడినదో ఆ వ్యక్తి పేరును, చిరునామాను పోలీసు అధికారి కోరిన మీదట, శాసనసమ్మత హేతువేదియు లేకుండ, అతనికి తెలుపుటకు నిరాకరించు చో, రెండు వందల రూపాయలదాక ఉండగల జుర్మానాతో శిక్షింపబడును.

(3) ఏ దస్తా వేజు విషయములో ఎవరేని వ్యక్తి పై ఉపపరిచ్ఛేదము (1) క్రింది అపరాధము ఆరోపింపబడినదో అట్టి దస్తా వేజు పైన గాని, అట్టి దస్తావేజా సంబంధమున ఉపయోగింపబడిన లేక పంచి పెట్టబడిన ఏదేని ఇతర దస్తా వేజు పైన గాని ఎవరేని వ్యక్తి పేరు ఉన్నయెడల, తత్పతికూలముగ రుజువు చేయబడునంత వరకు, ఆ వ్యక్తి ఆ దస్తావేజును రూపొందింపజేసినాడని పురోభావన చేయవచ్చును.

అధ్యాయము-19

సేవా కాంట్రాక్టుల ఆపరాధికభంగమును గురించి

490. ... ... ... ...

నిస్సహాయుడై నవ్యక్తికి పరిచర్యలు చేయుటకు అవసరములను సమకూర్చుటకు చేయబడిన కాంట్రాక్టు భంగము.

491. లేబ్రాయము వలన, మతిస్తి మితము లేనందువలన, రోగము వలన, లేక శారీరక దౌర్భల్యమువలన తన సురక్షత కొరకు ఏర్పాటు చేసికొనుటకు గాని తన అవసరములను సమకూర్చుకొనుటకు గాని నిస్సహాయుడు లేక అశక్తుడు అయినట్టి ఎవరేని వ్యక్తి కి పరిచర్యలు చేయుటకు లేక అవసరములను సమకూర్చుటకు శాసనసమ్మతమైన కాంట్రాక్టు ద్వారా బద్దుడై యుండి, స్వచ్ఛందముగ అట్లు చేయకుండ మానివేయు వారెవరైనను, మూడు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతోగాని, రెండు వందల రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

492 ... ... ... ...

అధ్యాయము-20

వివాహమునకు సంబంధించిన అపరాధములను గురించి

ఒక పురుషుడు శాసన సమ్మతముగా వివాహము జరిగినదని మోసముతో విశ్వసింప జేసి తనతో కాపురము చేయునట్లు చేయుట.

493. ఒక పురుషుడు తాను శాసన సమ్మతముగా వివాహమాడని ఎవరేని స్త్రీని, తనతో ఆమెకు శాసన సమ్మతముగ వివాహమై నట్లు మోసముతో విశ్వసింపజేసి ఆ విశ్వాసముతో తనతో కాపురముచేయునట్లు, లేక సంభోగమును సల్పునట్లు చేసినచో ఆతడు పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడును, మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును.

భర్త జీవించియుండగా భార్యగాని, భార్య జీవించియుండగా భర్త గాని మరల వివాహమాడుట.


494. భర్త జీవించియుండగా భార్య గాని, భార్య జీవించియుండగా భర్త గాని వివాహము చేసికొనిన కారణముగా అట్టి వివాహము ప్రభావ శ్యూనమై నట్టి దగు ఏ పరిస్థితిలోనై నను అట్టి వివాహము చేసికొనువారెవరైనను,ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

మినహాయింపు :-- అట్టి భర్తతో లేక భార్యతో ఒక వ్యక్తి కి జరిగియుండిన వివాహము ప్రభావ శూన్యమై నదని సమర్థ వ్యాయస్తానముచే ప్రఖ్యానింపబడిన చో ఆ వ్యక్తి కి ఈ పరిచ్ఛేదము విస్త రించదు, మరియు

పూర్వ వివాహపు భర్త లేక భార్య జీవించియుండగా వివాహము చేసికొను వ్యక్తి కి తరువాతి వివాహమగు ఆ సమయము నాటికి అట్టి భర్త లేక భార్య అట్టి వ్యక్తి వద్ద నిరంతరాయముగా ఏడు సంవత్సరముల పాటు లేకుండాపోయి జీవించి యుండినట్లు ఆ వ్యక్తికి ఆ కాలములో సమాచారము లేక పోయినచో, అట్టి తరువాతి వివాహము చేసికొను వ్యక్తి కి