పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/95

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఆజటి యిట్లనియె.

7


క.

గంగానది దీనిక్రియన్
సంగతి శేషాహికైన శతధృతికైనన్
యంగజహారికినైనన్
యంగద గాదే గణించ నాశ్చర్యగతిన్.

8


వ.

అట్టి గంగా[1]జననసరణి యెట్లంటేని.

9


చ.

అదయసహస్రహస్తఖచరాహితతాత [2]కృతార్థిఁ గన్న యా
త్రిదశధరాధినేత యతిదీనత నారసి తల్లిగాన నా
యదితి సహించలేక జలజాసననందనశాసనక్రియన్
జెదరక కాన కేఁగి హరిచింతన జేయఁగ సాగె నిష్ఠచేన్.

10


చ.

తలఁచిన నగ్రధాత్రి నుచితక్రియ నిల్చిన శేషశాయినా
జలజదళాయతాక్షిఁ గని సాగిలి[3]తా నతిఁ జేసి లేచి [4]కే
లలికతటిన్ ఘటించి యతి హర్షరసస్థితిచే ననేకచ
ర్యల గణియించి యాడెఁ దనయండ జటిచ్ఛటలెల్ల నారయన్.

11


వ.

అట్టియెడ హరి యిట్లనియె.

12[5]


క.

కనకాంగీ దశశతహ
స్తనిశాచరనేత తండ్రి సాహసగతి నీ
తనయాగ్రణి [6]గలచఁగ నిటు
చనిన తెఱంగయ్యె నింత జడియఁగ నేలా.

13


చ.

[7]సలలితు నీతగానిజయశక్తి జయించఁగ రానిదానిచే
నెలఁత చలించ నేటి కెద నీజఠరస్థలి నే జనించెదన్
[8]ఖలఖచరారి నేత సిరి గాఢతరక్రియ సంగ్రహించి ది
క్తల నరకర్త లెన్నఁగ హితస్థితిచే నచలారి కిచ్చెదన్.

14
  1. జలసరణి (శి)
  2. కృతార్థి (శి)
  3. యానతి (శి)
  4. కేలలితము (శి)
  5. 12వ నెం. వచనము శి- లోలేదు.
  6. గలచెంగట (శి)
  7. సలలితనీతిగాని (శి)
  8. ఖరఖచరారి (శి.గ.)