పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/91

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

హరికిరి గంధనాగశలలాండ సృగాల హరీశఖడ్గ కా
సర హరిణీరటద్గహన సంహతిఁ గాంచి యగాధనీర ని
స్తరతటి నీతతిం గడంచి చండధరాధరరాజి దాటి దా
శరథి చనంగసాగె జటిచంద్ర సహాయతచేత నయ్యెడన్.

106


క.

ఈరీతి గాధిజర్షిని
నారా [1]నెలసర్ల గాంచి యాగ్రహశిఖి కీ
లారటితగాత్రి తాటక
దారుణ లేచి హితదైత్యతతి గలసి ధృతిన్.

107


చ.

ఘనచరణాగ్రఘట్టనల గ్రచ్చఱకంధి కలంగ నీరద
స్తనితహృదట్టహాసనినదక్రియ నష్టదిశల్ చలించ దృ
గ్జనితదృఢాగ్రహానలశిఖాకణసంహతి రాల నానరా
శనసతి తా నెదిర్చి ధృతి సంధిల ఖేటకఖడ్గహస్తయై.

108


ఆ.

అంత గాధితనయు డతిరయక్రియ దేర
దాశరథిని నతనిదాయి నరసి
దండ జేరనేఁగి తాటక యని సేయ
గదినె నాలసించఁగా నదేల?

109


క.

స్త్రీయని దాని తిరస్కృతి
జేయంగాఁ దగదు నడఁగఁ జేసిన ధరణీ
నాయక! సకలజనాళికి
రాయిడి గనకే హరించరాదే యనినన్.

110


చ.

హరిహయహస్తకీలితదృఢాశనిదారితశైలశృంగసం
సరణి, తదాజి దాశరథి చండశరాసనశస్త్రధారచే
ధర చలియించ నేసెఁ దెగఁ దాటక జాలకృతైక నాటకన్
హరిదిన దత్తహాటక నిరంతరఖేటక నిస్సహాటకన్.

111


వ.

ఇట్లు తాటక త్రెళ్లిన.

112
  1. నెలసరుల (వ్రా)