పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/87

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డారంజిల్కలఁ జీఱెడి
చేరిక రెండక్కరాలజీరఁగ నయ్యెన్.

81


గీ.

చిన్నకన్నియలిద్దఱఁ గన్నయట్టి
నందనత్రయి కాశతానందజాత
యతి, నరేంద్రాజ్ఞ దశరథజ్యాధినేత
యందఱల్ సంతనిల్ల నర్హాఖ్య లిడియె.

82


వ.

అంత.

83


క.

[1]కందింత లేని లేనెల
చందానన్, నాఁట నాఁట జక్కదనాలన్
జెంది కళాయితచర్యల
సందడి రా చిన్న లెదుఁగసాగిరి ధరణిన్.

84


శా.

ఆరాలేనెల లంతకంత రతిరాజాకారలేఖాకళా
సారాచారశరాసనాస్త్రకలనాసారస్యలాక్షణ్యశృం
గారజ్ఞానదయాంచితస్థితి తితిక్షా సత్యధైర్యక్రియా
శ్రీ రంజిల్లఁ జరించసాగిరి జయశ్రీ హెచ్చ నానాఁటికిన్.

85


వ.

ఇట్లు దేరినట్టియెడ.

86


సీ.

రంజితగాంగేయకంజ[2]కింజల్కాళి
             దండిగా జడల నీరెండ గాయ
నన్యచింతాహరణాదినారాయణ
             కీర్తన లంతంత నర్తిలింగ
సకలతరంగిణీసలిల గ్రహయౌ క
             రాంచితకరశాఖయర్ధిఁ దనర
నంగయష్టి నలందినట్టి నీఱెల్లడ
             నకలంకచంద్రచంద్రికల నీన
అష్టదిగధీశ కిన్నర యక్షసిద్ధ
దితిజఖచరస్థిరస్థలాయతకిరీట

  1. కందందనియా తేనెల (వ్రా)
  2. కింజల్కాది (ము)