పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/76

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బహుళనీరాజనాతివిభ్రాజితాంఘ్ర
సరసిజుఁడు చెన్నయాచార్య చక్రవర్తి.

18


క.

తనజననీగర్భంబున
జనియించెడివేళ నొకభుజంగమకవయై
కనుపట్టి యనంతాళ్వా
రను పేరన్ బరఁగి చెన్నయార్యుం డలరెన్.

19


చ.

చెలిమి గజేంద్రవల్లభునిచేత సపర్యలుఁ గొంటఁ, గాన బె
బ్బులిరదనంబు లూడ్చి వడిఁ బో నిడుటల్, తళిహప్రసాదమున్
పెలుచగు బ్రహ్మదైత్యునకుఁ బెట్టుటలున్, బెనుబాము ముక్తి కిం
పలరఁగఁ బంపుటల్ గలమహాత్ముఁడు చెన్నగురుండు భాసిలెన్.

20


ఉ.

చెన్నుగ బ్రహ్మరాజపురి చెన్నుఁడు తా నిలవేల్పు గాఁగ నా
చెన్నుని [1]పేరుబూని సిరి [2]జెందుచు దేవరకొండసీమలో
సన్నుత పణ్కరాజు పలిశైలమునన్ మరిఁగంటి చెన్నుఁడై
[3]యెన్నిక మించె భూజపము లింటను దొడ్డను మందపేరిడన్.

21


సీ.

వేదశాస్త్రపురాణవిద్యల [4]నలరారు
             చక్రవర్తుల [5]గెల్చి విక్రమించె
నవని బందొమ్మండ్రయన్నలతోఁ బుట్టి
             హరులీల పాలాక్షుఁ డగుచు నలరె
శ్రీమతంబుఁ బ్రసిద్ధి జేసెడి మణవాళ
             యతికి [6]సమానుఁడై యతిశయిల్లె
సూరి నలంతిగళ్ నారాయణస్వామి
             భాగినేయత గీర్తి బరిఢవిల్లె
బాచిపైకంబు ముడుచు లుబ్ధకులకెల్ల
నింట [7]బోజుగ విలసిల్లె, నిట్టిచెన్న

  1. పేరఁబూని (వ్రా)
  2. జెండెడు (వ్రా)
  3. యెన్నిక కెక్కె భూజనము లెన్నఁగ నింటను దొడ్డిపేరిడన్ (వ్రా)
  4. నటనచే (సా)
  5. కొల్వు లాక్రమించె (సా)
  6. సహాయుఁడై (సా)
  7. బొట్టుగ (సా)