పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/223

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

సకలసన్నాహసంగతి జత దనర్చి
రాయగతిని యెల్లి యిచటికి రాగఁ జేసి
తిరిగి రారాదె యని యన్చ సరగనట్ల
చనియె హరికర్తలందఱల్ సంతసిల్ల.

243


క.

అగచారినేత యటఁ జని
నగశాననతతినిఁ గడచి నయగతినంతన్
దగఁ గంగదండ గ్రక్కున
నిగిడిన దయగల కిరాతనేతన్ గాంచెన్.

244


క.

కని దశరథతనయాగ్రణి
యెనయఁగఁ గానన జరించి యేతెంచి తగన్
ఘనత నిటకెల్ల రాఁగలఁ
డని తెలియఁగఁ జేసి చనియె నతిశీఘ్రగతిన్.

245


ఆ.

తరలి గంగ దాటి తా నంత సాకేత
రాజధాని గడచి రాగ నచట
సకలనరశరీరచర్యల గని యింక
నేనిటైన నగరె నిజతఁ తెలియ.

246


క.

అని నరదేహక్రియ దా
నెనయంగాఁ దాల్చి నగరి [1]కేఁగఁగ ఖరజి
జ్జననీత్రయి యలరంగా
సనయగతిం దెలియఁజేసి సాగిలి యంతన్.

247


తే.

జానకీజాని యిచ్చట సరగ నెల్లి
రాగలఁడటన్న నందఱల్ రంజిలంగ
నటఁ దరలి నందినగరిఁ జక్రాంశజాత
శశిని గని హర్షియై చక్కఁ జాగి నిల్చి.

248


ఉ.

తాటకహంత యిచ్చటికి దానని చెందఁగ దెల్యఁజేయఁగా
నేటికి [2]నండజాక్షజటినేత సహాయత నాశ్రయస్థలిన్

  1. కేగట (ము)
  2. (నండజాఖ్య ?)