పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/215

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇట్లు దాశరథియాజ్ఞ నింద్రజిద్దితిజారాతీయగచరసేన లాచ్ఛాదించ దశకంఠ
సహజునిం గలిసి చని లంకారాజధాని చేరి ఝల్లరికాహళనిస్సాణశంఖానక
ఢక్కానాదక్రియల్ జెలంగ గేహినీసంగతి నతని సింహాసనస్థాయిగా రచి
యించిన కాంచనరచితచేలకంఖాణసారంగశతాంగసైనిక [1]దాసదాసీ
సకలార్థిసంతతికిం గర్తయై హితరాక్షసరేఖల్ నిండ హర్షస్థితిం జెంద నిట్ల
న్నిశాచరనేతకనిష్ఠదాయిని నధిష్టాతం జేసిన నత్యంతసంతతాతిశయతఁ జెలంగి
యా చిన్నరానెల ననేకయలంక్రియల నలంకరించిన నటఁ గదలి తదగ్రస్థలి
నంగదహరి నెక్కి యేతేర తా నతనిదండనే చని రాజశశింగాంచి కాళ్ల కెరఁగి
లేచి నిలిచి యిట్లనియె.

202


ఉ.

రాక్షసహారి! నీచరణరక్షల దాల్చితి నాహృదంతరిన్
దీక్ష ఘటిల్ల ధన్యగతి తేజితగాంచితి రాజ్యకర్తనై
యీక్షణకాంతి చాలదయ యేచి కలంగదసాగఁగంటి కం
జాక్ష! యహీశయాన! యన సాదరలీలలఁ దేల్చె నాతనిన్.

203


వ.

అంత.

204


ఆ.

దైత్యహంతయాజ్ఞ దాల్చి యనిలజుండు
జనకరాజతనయ సరస కేఁగి
హర్షసిద్ధి సీత కరాస్యలఁ గైసేయ
యనచి నంత జేరి యాశ్రయించి.

205


క.

తల యంటి యటక లిడి చె
న్నలరఁగ నీ రార్చి చిన్నియలదేర్చిన ఛా
యల చెంగట్టఁగ నిచ్చిరి
కలయఁగ జిగియైన తేటకై సందడఁగన్.

206


సీ.

ఘనఘనాంతస్థలాగతతటిల్లత లెల్లఁ
             దనర నాకాకృతి దాల్చె ననఁగ
స్రష్టధాత్రీస్థలి జక్కదనాలన్ని
             యేర్చి టెంకిగ రచియించె ననఁగ

  1. దాసీదాస (ము)