పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/203

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దానిఁ గనకాద్రిజాడ హెచ్చైనదాని
దేరదన నెక్కి నిలిచె నాదితిజకర్త.

132


క.

నిలిచి హితదండనాయక
హళహళికలచే నిశాచరాగ్రణి లంకా
స్థలిఁ గడచి హరిహయాశా
చలకందరనగరిహేళి సరణిం జనియెన్.

133


క.

లయకాల కాలదండ
క్రియచే రణధరణి దైత్యకేసరి చాలా
జయకాంక్ష నిలిచె నిర్జర
చయచిత్తతచే [1]ఘనాతిశాతాసి యనన్.

134


సీ.

ఖచరారినాయకకాసారసారంగ
             దహననీరజకాండధార్తరాష్ట్ర
దినకరనందనధృతిలతికాధాశ్ర
             [2]చారణాహితశాతచండకిరణ
జలధిధాత్రీనాథజగతిధరాశని
             యనిలాంధకారరాకాద్రితనయ
యక్షరాజానిలాహారకేకశ్రేష్ఠ
             చంద్రశేఖర తటీ సాంద్రతటిని
యని కళాధరదితిజసంహతి గడంగి
రెండెదలఁ జేరి ఘనఘనాఖండనాద
కఠినగద్యాదిగాథల గణన సేయ
నిలిచె ననిదారి దశకంఠనిర్జరారి.

135


వ.

ఇట్లు లయకాలచండకరాకృతి చంద్రహాసధారియై తేజరిల్లె నయ్యెడ.

136


క.

రెండెడల దితిజకర్త ల
జాండస్థలియగల ఢక్క లఖిలక్రియలన్

  1. ధనాతి (ము)
  2. శారణాహితశాదచండకిరణ (ము)