పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/200

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చనరథరేఖ లీడిగిలె జండగజేంద్రఘటల్ నశించె నిం
కనయిన నీర్ష్యడించి నయకార్యగతిం గనరాదె చక్కఁగన్.

118


ఉ.

ఆతతకీర్తి సంస్థలి దయారసకంనిధి యార్తచేతన
త్రాత ధరాధరేంద్రధృతి దాశరథక్షితినాథహేళికిన్
[1]నీత సనీతి నిచ్చి నతిఁజేసి గణించిన నీహృదిష్టకాం
క్షాతిశయక్రియ ల్ఘటనయయ్యెడి చిల్లరగాథ లేటికిన్.

119


శా.

హేలాసంగతి నాంజనేయహరి తా నేకాకియై చేరి తా
నీలంకాస్థలి నెంత చేసె నది నాఁ డీక్షించరే యన్నిఁటన్
యాలాగంతటికన్నధైర్యనయచర్య ల్గన్నకీశచ్ఛటల్
నేల న్నల్దిశ లంతరిక్షసరణిన్ నిండారినా రారయన్.

120


ఆ.

ఈనెలంత నతని కిచ్చి లంకాస్థలి
దాయి కిచ్చి గహనఛాత్రి కేఁగి
తేని లెస్స యట్ల లేనినాటికి దాశ
రథికరాగ్ని ద్రెళ్లరాదె యాజి.

121


క.

అని తేర్గడ నెదిరించిన
దనగేహిని జేరఁ జీఱి దశకంఠనరా
శనకర్త యాగ్రహస్థితి
గననీయక యాడె నీతికార్యాసక్తిన్.

122


క.

జానకి యేసరి ధరణీ
జానియె దృష్టాంతశేషశాయిగ యాహా
యే నెఱుఁగనె నెలతా! య
జ్ఞానినె నీయంత శాస్త్రసరణిఁ దెలియనే.

123


చ.

కనికని నేరకే యనృతగాథల నాడ నతేటి కాజి నా
యనశరధారలం దెగి దిగంతనరేశితలెల్ల నెన్నఁగా
సనకసనందాదియతిసంతతి నందఁగరాని టెంకికిన్
జనియెద గాన దీనికి శంకిల నేటికి నీరజాననా!

124
  1. సీతను నీతి నిచ్చి నుతి జేసి (శి. గ)