పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/198

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తనిదాయి నెన్నిదినకర
తనయాద్యగచారిఘటల దగ ననిచె నటన్.

109


క.

చని యజ్ఞదీక్షచే ని
ల్చిన లంకాకర్తఁ జేరి చిత్రక్రియలన్
గని గాసినేయ దరలక
కనకాచలసదృశధైర్యగతి దనరె నటన్.

110


సీ.

కరశాఖల గ్రహించి గండశిల ల్దెచ్చి
             యెత్తి శిరశ్శ్రేణి నేసియేసి
కట్టిన తగటద్దినట్టి శాటిక లెల్ల
             చించి గండ్రల్గాగఁ జేసిచేసి
ఘనతరకఠినాంఘ్రిఘట్టనక్రియలచే
             ధాక కట్టెదయంట దన్నితన్ని
నిర్ఘాతసంకాశనిస్సహచండాట్ట
             హాస[1]లీలలఁ దెగటార్చియార్చి
[2]జదకఁగా యాజ్యకలశికల్ చరచిచరచి
నీళ్ల యాగాగ్నిశిఖ లార [3]గేళ్ల జల్లి
నట్టిదానఁ జలించక యాదశాస్య
చారణారాతి కనకాద్రిసరణి నిలచె.

111


తే.

సకలహరిఘట లీరీతి చంద్రహాసి
డాసి యెంతెంత దెలిసియుఁ గాసి చేసి
తరలక హిరణ్యశిఖరి చందాన దనర
కలక నిశ్చలచర్యల నిలిచి రంత.

112


వ.

అయ్యెడ.

113[4]


చ.

అనిలజశాసనక్రియ నయస్థితి సంధిల శక్రజాతనం
దనహరి కెకసీతనయదారయదాటల కేడియార్తిచే

  1. లీలను (ము) లీలలఁ దెగనార్చియార్చి (శి)
  2. జడకగా యద్యకలశిఖల్ (ము)
  3. నిలిచిచల్లి (ము)
  4. 113 నెం. వచనము (శి)లో లేదు.