పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/197

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


న న్నడగఁగ నేతెంచితె
చెన్నటి నీకెద్ది నడక చెడతఱి యయ్యెన్.

102


చ.

గిరిచరసేనలం గలసి క్రీడ ఖరత్రిదశారిహంత రాఁ
శరనిధి దాటి నీనగరి జుట్టిగనాగిన దింతెగాక య
క్షరతరశస్త్రధారల నిశాచరకర్తల నందఱిన్ [1]రణ
స్థిర హరియించెనన్న గడతేర్చఁగ నేరనయా దశాననా!

103


ఉ.

ఏయెడఁ గింకరక్రియలహెచ్చరికం గిరిశాసనాది ది
ఙ్నాయకయక్షసిద్ధఖగనాగనిశాచరకర్త లర్చనల్
సేయఁగ హంసయానశశిశేఖరదత్తజయార్థసిద్ధిచే
హా! యఘకారి ని న్నెఱఁగ కాఱడిఁ జెందితె యందఱల్ గనన్.

104


క.

ఐనట్టిదాని కలజడి
యానంగా నేటి కిక నరాశననాథా!
నేనెఱిఁగించినగతి నె
య్యాన జనిన కార్యసిద్ధి యది యెట్లన్నన్.

105


క.

[2]క్షితిజానాయకహరిసం
హతి గానఁగనీక యహితహరిణేష్ఠి నయ
స్థితి గడసాగఁగ జేసిన
హితగతి నీకాంక్షలెల్ల నీడేరుఁ దగన్.

106


చ.

అని యతఁ డానతిచ్చిన దశాననరాక్షసకర్త హర్షియై
తనగృహధాత్రి కేఁగి సహితస్థితి సంధిల నేకతానఁ జ
య్యన నరిగంజనేష్ఠి దనరార రచించెడిదానఁ జేసి యా
యనలశిఖాచ్ఛటల్ గలయ నాశల నిండఁగసాగె నయ్యెడన్.

107


వ.

అంతఁ గైకసీకనిష్ఠతనయనిశాటనేత దెలిసి.

108


క.

తనయన్నయజ్ఞచర్యల్
గని సీతాజాని కెరుకగాఁ జేసిన యా

  1. రణస్థలి (శి)
  2. క్షితిధరచరఖేచర సం....(శి. గ.)