పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/182

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అంత.

7


మ.

గద కేలన్ ధరియించి చండతరనిర్ఘాతాట్టహాసక్రియల్
చదలంటన్ జరణాగ్రమట్టనల నాశల్ దల్లడిల్లంగఁ దీ
క్ష్ణదిశల్ దీర్ఘదృగంచలాగ్నికణసంక్రాంతిన్ జరించంగ నా
త్రిదశారిం గని కీశసేన లధికార్తిన్ డాగె నాయాయెడన్.

8


క.

ఆతరణితనయ గిరిచర
నేత కఠిన[1]శిలలఁ దెచ్చి నెట్టన ఖచరా
రాతి శిరస్స్థలి నేసిన
ఘాత నెడం దెలియలేక గడ దెలిసి ధృతిన్.

9


తే.

కలశకర్ణనిశాచరకర్త కెరలి
త్రిశిఖసాధనధారియై తీక్ష్ణసరణి
హేళినందన హరికర్త నేసెఁ దాని
కి దితిజశ్రేణి గాంచి చెల్లాడి చనఁగ.

10


మ.

తనదారిన్ లయకాలచండశిఖినా దాకంగరాఁ దానిఁదాఁ
గని లీలం గరశాఖ నంది హరిరేఖల్ కీర్తనల్ సేయఁగా
దినరాణ్ణందనకీశకర్త యది యర్థిం గాళ్లచే నాని చ
య్యన గండ్రించె నిశాటసైన్యతతి యాహాకారతన్ జెందఁగన్.

11


క.

తనచేత నిరర్థకగతిఁ
గని దానికి కలశకర్ణఖచరారి ఘనా
ఘనగర్జలచే నిననం
దన హరి కేలం గ్రహించి తరలని దండిన్.

12


చ.

ఘనతరశక్తిచేఁ గలశకర్ణనిశాచరనేత యర్కనం
దనహరిచేఁ గ్రహించి యరతన్ ధరియించి చనంగఁ గాక నా
తని దృఢకర్ణనాసిక లధఃక్రియచే దెగనేసి యార్చి చ
క్కనెగికెఁ దారకాసరణిఁ గాంచి హరిత్తలకర్త లెన్నఁగన్.

13
  1. శిఖర (ము)