పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/175

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

ఎంచఁగ ధాత్రి జారిన యహీనకళాజనితక్షితీశతన్
గాంచి దశాస్యరాత్రిచరకర్త రథస్థలిఁ డిగ్గజేరి య
త్యంచితశక్తిచేత, కదలాడఁగ జేయఁగలేక గానలన్
సంచలితాంగయష్టియయి చాలనదల్చె ఖరారిఢాకచేన్.

149


తే.

సారథిని డించి హయతతి సంహరించి
తేరిలం ద్రెళ్లనేయ [1]దద్దర్లి తరల
ఘనకిరీటచ్ఛటల్ రాలఁ గైకసేయ
రాక్షసాగ్రణి లంక జేరంగ నరిఁగి.

150


వ.

అంత.

151


చ.

ఎనయఁగ నేల ద్రెళ్లిన యహీశకళాజనిరాజహేళి, నా
యనిలజకీశనేత గదియం జని కేల గ్రహించి యాజినం
దననరకర్తచెంత నిడినన్, సనయక్రియ లేచి సాగె నిం
గి నిఖిలనిర్జరచ్ఛటలకీర్తన లెల్లెడ నిండి సాగఁగన్.

152


వ.

అయ్యెడ దశకంఠలేఖారి దద్ద(ర్లి)రిల్లి రాలిన కిరీటాద్యలంక్రియలు,
చినిగిన హాటక[2]నిశాటికలు, గండ్రలైన సారథిశకలాంగకంఖాణచ్ఛటల్
గలిగి యద్రిచరరేఖల్ హసించ, నిశాటసేనల్ నశించ లంకానగరిఁ జేరి
యంతస్స్థలి కఱిఁగి, హితసంతతి యాచ్ఛాదించ, సింహాసనస్థిర నధిష్ఠించి
తనయార్తి యందరల కెరింగించి కలశకర్ణరాక్షసనేత నిద్రదేర్చ హిత
దండనాయకకర్తల ననిచినయెడ.

153


సీ.

అధికనాసాకందరాయాతయాతాని
             లాహతి నింగి యట్టట్టె [3]యదర
నశనిసంకాశదంతాగ్రజకిటికిట
             నినదసంతతికి కంనిధి కలంగఁ
గఠినతంద్రాక్రాంతగాథల హరిహరి
             కర్తల కట్టెదల్ గాసిఁ జెందఁ

  1. (దద్దరిల) పై పాఠమే (శి)
  2. శాటికల్ (శి)
  3. యరయ (ము)