పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/174

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గలిగి దశకంధరనిశాటకర్తసేన
లానఁగాలేక యంచితగ్లానిచేత
నందఱల్కన్నదే నాగనార్తి జనిరి
నింగి నిర్జరసంగతి నిచ్చగించ.

143


తే.

చెక్కలై నట్టి యరచాలఁ జిదికినట్టి
గంధనిజరాజిరేఖల గండ్రలైన
యట్టి తత్తళఁ గలిగి దశాస్యసైని
కచ్ఛటల్, గన్నదేగాట గదలెనంత.

144


ఉ.

ఆయెడ గైకసేయఖచరాహితకర్తఖరారిదాయి య
త్యాయతశక్తిఁ [1]దారసిల యచ్ఛశరాసనశింజినీగళ
త్సాయకరేఖలం గనల స్రగ్గఁగ జేయఁగ సాగి రష్టది
ఙ్నాయకసిద్ధసాధ్యఖగనాగఘటల్ గని దద్దరిల్లఁగన్.

145


క.

[2]అనిలాశననాథకళా
జనితధరాధీశహేళి సంగడియై ని
ల్చిన [3]దనదాయిని చక్కఁగ
గని, దాళకయంగయష్టిఁగా దగనచటన్.

146


చ.

ధృతి దశకంఠదైత్యకరి[4]దృగ్జనితాగ్నిశిఖాకణచ్ఛటల్
క్షితిగగనస్థలిన్ దిశలఁ జిత్రగతిన్ గలయంగ నిండఁగా
శతధృతి దత్తచండతరశక్తి రయక్రియ నెత్తి యేసి యం
చితదితిజాద్రిచారితతి చేష్టలడంగి కనంగ నయ్యెడన్.

147


తే.

దశగళత్రిదశారాతి దాయిదాని
రానరసి కాంచి రాక్షసారాతిదాయి
యతని యగ్రధరిత్రి తా నడ్డగించ
శక్తి దాక నిలాస్థలిఁ జారె నంత.

148
  1. దారసిలి (శి)
  2. అనిలాశదాథకళా (ము)
  3. తనదాయిం జయ్యన (శి)
  4. దృగ్జనితాగ్ని (శి)