పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/157

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

నింగి గానరాని నీడ నిండిన గాంచి
దాశరథి దశాస్యదైత్యకర్త
శక్తి గాగఁ దెలిసి సకలఖచరధరి
త్రీచరాళి గనఁగ తీక్ష్ణసరణి.

48


చ.

క్షితితనయాధినేత తనచేతి శరాసనయష్టి నారి నం
చితిగతి నస్త్రసంఘటనఁ జేసి దశాస్యఖగారిఛత్రసం
తతి తృణలీల నేసిన యఛాయధలై జలరాశి నల్దిశల్
క్షితి గలయంగనిండె నహిసిద్ధఖగాండజరేఖ లెన్నగన్.

49


తే.

జానకీజాని శరహతిచే నిశాట
నేత ఛత్రాళి గండ్రలై నేలఁ ద్రెళ్లె;
[1]యల్లరాజగృహస్థలి యార్తి డిగ్గి
హితనిశాచరకర్తల నెనసినంత.

50


క.

తనతల్లి యగ్రజనయిత
గని చేరఁగ జీఱి రత్నకలితహిరణ్యా
సనధర నిల్కడ సేయిం
చి నితాంతస్నేహసరణి జెందఁగ నాడెన్.

51


తే.

ఎన్నిక నిశాటసంతతికెల్ల నాస
చేత కల్యాణసిద్ధిగా జేయనైన
యార్తి నడచంగ నన్నిఁట నలరినట్టి
నన్నిచటి కేగఁజేసితి నీతి దెలియ.

52


క.

జలధి ధరాధరతతిచే
నలరఁగ గట్టించి రాక్షసాదిత్రిశృంగా
చలధాత్రిన్ గిరిచరసే
[2]నలచేత న్నిలిచె నట్టి నడకలఁ దెలియన్.

53


వ.

అని యిట్లాడిన లంకానేతం గాంచి [3]కైకసజనకాగ్రజనిశాటకర్త
యాగ్రహించి.

54
  1. అల్క (గ)
  2. నల చేదిన్నిలసెనట్టి నడక దెలియఁగన్ (ము)
  3. కైకసిజనతాగ్రజనిశాటకర్త (శి)