పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/151

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ర్ఘాతదృఢాస్త్రధార లధికక్రియ నీతలలెల్లఁ ద్రెంచగా
నాతరి నానయస్థితి యహా! గణియించఁగ దాచనేర్చెదే.

13


క.

చింతఁ [1]దొలగించి సీతా
కాంతం దాశరథి కిచ్చి ఘననయగతి నీ
సంతతి హిత రాత్రించర
సంతతి రక్షించఁగదె నిశాచరనాథా!

14


తే.

అనిన తనదాయిఁ గని చంద్రహాళి కాలఁ
దన్నెఁ, దన్నినదానికి ధరణి జారి
లేచి యందఱ నార్తి యాలించనాడె
సాహసక్రియచే నీతి సడలనీక.

15


సీ.

సీత గా దిది దైత్యశేఖర నీ కేల
             సల్లిన యట్టి నీలాహి గాని
సీత గా దిది దైత్యశేఖర నీనెత్తి
             [2]కట్టెజారిన యట్టి యశని గాని
సీత గా దిది దైత్యశేఖర నీశాటి
             నంటిన యట్టి చండాగ్ని గాని
సీత గా దిది దైత్యశేఖర నీయింట
             నట నిల్చినట్టి రక్తాస్య గాని
సీత గా దిది నీయెడ ఘాతనాటి
నట్టి [3]హలహలతీక్ష్ణశాతాసి గాని
యైన నాగాథ లాలించి యతనిగృహిణి
నతని కిచ్చినఁ గాదె నీయంగరక్ష.

16


చ.

అని తృణలీలగాఁ దెలియనాడె ధృతిన్ [4]హితజాతసంతతిన్
దనజనయిత్రిఁ జేరఁజని తత్ స్థితి యంత నెఱుంగఁజేసి చ
య్యన జలరాశి దాటి సకలాద్రిచరేశిత లెన్న జెంత ని
ల్చిన ఖరహంతఁ గాంచి నతిఁ జేసి గణించిన హర్షశాలియై.

17
  1. దలఁగించి (ము)
  2. కట్టి (ము)
  3. హాహాల (ము)
  4. హితజాలసంగతిన్ (శి)