పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/133

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అని యతనియాజ్ఞ నొద్దికిఁ
జని యర్కజహరికి సకలచర్య లెఱుఁగఁజే
సిన సంతసిలి దశరథ
తనయాగ్రణిఁ దేగననిచెఁ దహతహ లెసఁగన్.

75


వ.

ఇట్లాంజనేయహరి యార్కియానతిఁ దిరిగిచని దాశరథిం గాంచి.

76


క.

[1]ఇక్కడికార్కికి రారా
దక్కడి కేతెంచితేని నఖిలాకాంక్షల్
చక్కఁగ నీడేరును నా
నక్కఱచే లేచి యధికహర్షాసక్తిన్.

77


మ.

అలధాత్రీశిత యంజనాతనయ సాహాయ్యక్రియల్ రా గిరి
స్థలిఁ గీశక్షితినేత గాంచి యతికాంక్షల్ దీరఁగా డిగ్గి తా
రలయాహ్లాదరసస్థితిన్ గదసి గాఢాలింగనాద్యర్హచ
ర్యలచేతన్ నటించి నిల్చిరి రహస్యక్రీడచే నయ్యెడన్.

78


క.

ఆదాశరథిని గని య
త్యాదరగతి నర్కతనయ హరితాహృదయా
హ్లాదరసస్థితిచేఁ గల
నాదక్రియ నాడె నీతి వర్తిల్లంగన్.

79


చ.

అనఘచరిత్ర! నీనడక లాహరిచేత నెఱింగినాడఁ జ
క్కని చరణాగ్రఘట్టనలఁ గంనిధి లంక యడంగ దన్ని య
త్యనతదశాస్యరాత్రిచరదంతి నహంక్రియ జార్చి తెచ్చి న
ర్తనగతి నగ్రధాత్రి నిడెదన్ జరియించఁగనీక కట్టెదన్.

80


సీ.

అదిగాక నే నిట్టియద్రిఁ గీశసహాయ
             తాస్థితిఁ జరియించ, దైత్యనేత
కాంచనస్యందనాగ్రస్థలి నిడియు జిం
             తాతీతరయగతి నరుగసాగ

  1. ఇక్కడికి + అర్కికి = ఇక్కడి కార్కికి