పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/130

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యహిఖడ్గకిటిదంతిహర్యక్షగంధసా
             రంగచండారణ్యరాజి దాటి
యగణితరత్నాకరాతీతసాతత
             చిరతరహ్రాదినీశ్రేణి గడఁచి
కఠినరాత్రించరాకారకీచక[1]సార్జి
             నాగారసకలదేశాళి యరసి
చనుచు సీతాంగనాజాని చందనాగ
సంచరన్నిర్ఘరీఘనస్థగితఘనల
తాంతగంధానిలాహతాత్యంతదేహ
యష్టిసంజనితగ్లానియై కడంగి.

60


చ.

అలజడి రాక్షసారి చన నాసరణిన్ ధరణీధరాంగణ
స్థలి నని ద్రెళ్ళినట్టి హరిసారథిసంతతి గ్రద్దఁగాంచి చెం
తల కరుగంగ కన్దెరచి ధైర్యరసస్థితిచే ననేకచ
ర్యలఁ గణియించి సీతతెఱఁ గార్తి నెరుంగఁగజేసి యయ్యెడన్.

61


చ.

అనఘచరిత్ర! సత్యనిధి! యార్తశరణ్య! దయానిధాన! య
త్యనత దశాననాఖ్య గలయట్టి నిశాచరనేత చక్కఁగా
జనకనరేంద్రజన్ రథరథాస్థలి జేరిచి లంక కేడ్తెరన్
జనఁగని యడ్డగించి దృఢసంధి ఘటిల్లఁగ నాజి జేసితిన్.

62


క.

అరికట్టి సాగనీయక
చరణనఖరశస్త్రికల నిశాచరనేతన్
జిరతరగతిఁ దన్న[2]నసృ
క్చరధారల్ గాత్రయష్టి జారఁగ డస్సెన్.

63


క.

ఇతరేతరకరదళితా
తతగాత్రజరక్తసలిలధారాసిక్త
క్షితి యయ్యె న్నిర్జరసం
తతి తారాసరణి నిల్చి దర్శించంగన్.

64
  1. రార్జ (ము)
  2. గ నృ (ము)