పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/122

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అనయ దశాసనాఖ్య గలయట్టి నిశాచరనేత చెల్లె లా
ఘనతరకాననస్థలికి గ్రచ్చఱ దాఁ జని దీర్ఘదేహి న
త్యనతకళానిధిన్ శతసహస్రలతాంతశరాకృతిం దయా
ఖని ధృతిశాలి దాశరథిఁ గాంచి గణించఁగసాగె నయ్యెడన్.

5


క.

ఆనడ లాచక్కదనా
లానీ టాతేట లానయక్రియ యాలా
గా నిల్కడఁ గనికని య
[1]త్యానందైకజలరాశి నల్లన దేరెన్.

6


చ.

జలచరకేతనాచ్ఛకరచండశరాసనశాతశస్త్రికా
దళితహృదంతరాళ యయి దైత్యగిరిస్తని రాక్షసారిచెం
తలఁ దరలంగ లేక సహితక్రియ సంధిలఁ గాంచసాగె దా
గలితళరీరసంజనితకాంతి యరణ్యధరిత్రి నిండఁగన్.

7[2]


వ.

ఇట్లు చేరి నిలచి.

8[3]


క.

అనఘా నీయాకృతి నే
గని దక్కితిఁ గనుక సరసకాండజకేళిన్
దనియించరాదె కలియక
యనిచిన నే దాళజాలనయ్య నరేంద్రా.

9


క.

ఇల నే నెఱిఁగిన కాయజ
కలితరహస్య క్రియల్ ఖగస్త్రీలయినన్
తెలియంగనేర రాయెడ
గలిసిన దృష్టాంతసరణి గాదే యనఘా.

10


ఆ.

అనిన దానిఁ గాంచి యఖిలచర్యలఁ దేల
నాడఁ జెండిచేత నీడగిలిన
యల్క కృథయు ధాత్రి జిల్క నేత్రాంచల
(?)రక్త నేత్ర లదరి రాయడిల్ల.

11
  1. త్యానందోజ్జలజరాశి నల్లన తేలెన్ (వ్రా)
  2. 7 నెం. పద్యము తరువాత 'శి'లో- "ఈరీతి దాశరథి గని.... శ్రీరంజిల గణన జేసి చిత్రక్రియచేన్-” అనుపద్యము గలదు. ప్రతి శిథిలము. పద్యము పూర్తిగా లేదు.
  3. 8 నెం. వచనము 'శి'లో లేదు.