పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/119

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అని యంత చరణరక్షల
ననిచిన దయ నీయ నంది నతిఁ జేసి ఘనా
ననకాంతి హెచ్చ నిలచిన
తనదాయిం గాంచి యాడెఁ దాఁ జిగురించన్.

157[1]


క.

అనినట్టి దాశరథి శా
సనగతి సాకేతనగరిజాడ జనక చ
క్కన జెంత రాజధానికి
సనయక్రియ నేఁగి నిలచె జటిలాకృతిచేన్.

158


మ.

తనదానస్థితి నర్థిసంతతికి నిత్యశ్రీల నందించఁగా
దనయత్యంచితకీర్తి దాన దిశలన్ దండించి కేల్ సేయఁగా
[2]దనహస్తస్థితిచేత నిట్టిధరయంతన్ నీతిచే నేలెఁ జ
క్కన ధాత్రీతనయాధిరాట్చరణరక్షాలగ్నహృచ్ఛాలియై.

159

ఆశ్వాసాంతము

క.

అనిమిషపతి శాసనసం
జనితావర్తక[3]ముఖాభ్రచయగళిత[4]శిలా
శనిజకణహద్గోవ
ర్ధనగిరిధరణ ప్రచండతర[5]నఖశిఖరా.

160


చ.

యువతివసంత, సంతతసముజ్జ్వలనీతివిధాన, దానవై
భవగుణదక్ష, దక్షరిపుభావసరోరుహసంగ, సంగర
ప్రవిమలసత్వ, సత్వరితపక్షినృపాలక కాండ, కాండస
ద్భువననివాస, వాసవసభోగమునిస్తుతవిక్రమక్రమా.

161


కలహంస.

నిరుపమకరుణాన్వితసదపాంగా
కరయుగసంభృతకంజరథాంగా
చరణాంభోరుహసంభవగంగా
హరశతధృతిహృదయాంతరసంగా.

162
  1. 157 నెం. పద్యము (శి)లో లేదు.
  2. 'తనహస్తస్థితిహేతిచేత ధరయంతా నీతిచే నేలె' (శి)
  3. ముఖాద్ర (శి)
  4. శిలాజనహృజ్జలకణహృ (శి)
  5. సఖ (శి)