పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/101

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

అట్టి జటిలనేత తట్టినయంతనే
యంగలతిక సడలి యార్తిచేతఁ
నెలఁత చిత్రగతిని శిలయయ్యె నై చండ
గహనధాత్రి నిలిచెఁ గదలలేక.

49


క.

అనఘ యది గనుక నీచ
క్కనిచరణహతిన్ దిగీశగణనల్ నిండన్
దనయాద్యాకారస్థితి
సనయక్రియ దాల్చి నిల్చె సారస్యగతిన్.

50


చ.

అనిన యదాట తజ్జటి, యహల్య నిజాకృతిచేత దాదన
ర్చిన యది యాలకించఁ జని శ్రీనిధి దాశరథిన్ గణించి చ
క్కని తనగేహినిన్ గలిసి కడ్డడగంగఁ జరించెఁ [1]గానలం
దెనసి యతీంద్రరాజి యెదనెన్నఁగ హర్షతఁ దేర నయ్యెడన్.

51


క.

అంతంతటఁ దక్కిన జటి
కాంతస్థలచర్య లెల్లఁ గని కనియెద న
త్యంతానందస్థితిఁ జనఁ
జెంతన్ సకలజనఘటల చేఱంతయ్యెన్.

52


చ.

జనకధరాధినేత సరసస్థితి యజ్ఞకరేచ్ఛగాంక్ష రా
ననచఁగ నేగినట్టి హరిదంతరసాతలనాథరాజి కాం
చనరథగంధనాగహయసైన్యహళాహళికాజయక్రియన్
గని కని గాధిజాతజటికర్త నిరంతరహర్షశాలియై.

53


క.

తనజ్ఞానదృష్టిచే చ
క్కని రాక్షసహంత కధికకల్యాణశ్రీ
లెనయఁగఁ గలదని దృఢగతి
జనియెన్ సకలజనఘటలసంద ళ్లదరన్.

54


చ.

చని యగ్రస్థలిఁ గాంచె నంత జనకజ్యాకర్త రాడ్ధాని దా
గనకాలంకృతచిత్రరాజి సదనాగ్రస్థానసంధానకే

  1. (కానలం దెనయ యతీంద్రరాజి యెద నెన్నఁగ హర్షముతోడ నయ్యెడన్)