పుట:దశకుమారచరిత్రము.pdf/28

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

21

తే. పరుని కొకనికి నిన్నియుఁ బ్రకటవృత్తి
     నిజములై పెంపు సొంపారి నెగడు నెట్టు
     కొమ్మనామాత్యు తిక్కనికొలఁది సచివుఁ
     డింక నొక్కరుఁ డెన్నంగ నెందుఁ గలఁడు.93

షష్ఠ్యంతములు


క. ఈదృశగుణభూషణునకు
     వేదాదిప్రకటవివిధవిద్యాభ్యాసా
     పాదితమహత్త్వునకు బల
     సూదనవిభవునకు సతతశుద్ధాత్మునకున్.94
క. శ్రీమంతునకు నిరర్గళ
     ధీమంతున కధ్వరాబ్జదిననాథునకున్
     సామాద్యుపాయవిదునకు
     నాముష్యాయణున కంగజాకారునకున్.95
క. చతురాననసన్నిభునకు
     సతతస్వాహాస్వధాదిశబ్దద్వయసం
     స్కృతహవ్యకవ్యసంత
     ర్పితమఖశిఖాముఖనిలింపపితృవర్గునకున్.96
క. హృద్భవనిభమూర్తికిఁ బ
     ద్మోద్భవవంశాగ్రణికి నయోన్నతునకు వి
     ద్వద్భోగ్యభాగ్యునకు గుణ
     సద్భావజ్ఞునకు నీతిచాళుక్యునకున్.97
క. [1]భాస్వద్గుణవితరణజిత
     భాస్వత్తనయునకు వినయపరునకుఁ గరుణా

  1. కొన్నిప్రతులలో నీపద్యము కన్పట్టదు.