పుట:దశకుమారచరిత్రము.pdf/199

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

దశకుమారచరిత్రము

     క నిట భవత్ప్రయత్నముప్రకారము బుద్ధి నెఱింగి దాని కే
     ననుగుణ మైనభంగి నెడయాడఁగఁ జొచ్చెద [1]నీతి చెప్పుమా.52
వ. అనిన విని పుష్కరికం బిలిచి పలకయుం జిత్రసాధనంబులు
     సవరించి తేరం బనిచిన నదియును దత్క్షణంబ కొనివచ్చు
     టయు.53
క. వల నేర్పడఁగ సురేఖా
     విలసన మొప్పంగఁ జాలు విన్ననువునఁ జె
     న్నలవడ నారూపం బా
     పలకం జిత్రించితిని సుభగవర్ణముగాన్.54
వ. ఇట్లు వ్రాసి చిత్రఫలక దాదిచేతి కిచ్చి దానితో ని ట్లంటి.55
తే. దీనిఁ గొని కల్పసుందరీదేవికడకు
     నేఁగి పరిజను లెవ్వరు నెఱుఁగకుండ
     నుత్తరీయంబు మాటుగా నునిచి పిదప
     నేకతంబునఁ జూపు మయ్యిందుముఖికి.56
క. చూపి యుచితంబులగు స
     ల్లాపంబుల నాలతాంగి లౌల్య మెఱిఁగి ర
     మ్మా పదపడి చేయఁగ మన
     కేపని దగు దాని నీకు నెఱుకపఱచెదన్.57
క. అనవుడు నట్లన చేయుదు
     నని యది యాచిత్రఫలక మడఁకువతోడం
     గొని యంతఃపురమునకుం
     జని వచ్చెం గొంతవడికి సంతస మెసఁగన్.58

  1. నీవు