పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/392

ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

373


2. మే : ఖూనీ చట్టానికి బ్రిటిష్ చక్రవర్తి యొక్క స్వీకృతి లభించింది.

1 జూలై . ఖూనీ చట్టం అమల్లోకి వచ్చింది. అందుకోసం ప్రదేశ అనుమతి పత్రాలు తీసుకొనేందుకై ప్రిటోరియాలో రిజిస్ట్రేషన్ ఆఫీసు తెరిచారు. ఆనాటి నుంచి ఆఫీసుకు చెందిన అధికారులు ప్రతిగ్రామం వెళ్లారు. అయితే ప్రతిచోట భారతీయులు వాళ్లను బహిష్కరించారు. 6000 మందిలో సుమారు 500 మంది, తమ పేర్లు నమోదు చేయించుకొని పత్రాలు తీసుకున్నారు. తరువాత గడువు తీరగానే పత్రాలు తీసుకోని వారిని అరెస్టు చేశారు.

18 సెప్టెంబరు . అసోసియేషనుకు గౌరవనీయులు శ్రీ గోఖలే గారి మంచి “మీరు సాగిస్తున్న పోరాటాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాను. చింతాక్రాంతుడనై అందు మనస్సును లీనం చేస్తున్నాను హృదయపూర్తిగా సానుభూతిని తెలుపుతున్నను. పోరాటాన్ని ప్రశంసిస్తున్నాను. దృడంగా వుండి భగవదేచ్చపై ఆధారపడండి." అంటూ తంతి వచ్చింది.

25. అక్టోబరు : ఖూనీ చట్టానికి వ్యతిరేకంగా ట్రాన్స్‌వాల్ నందలి ఏడు లేక 8 వేల మంది భారతీయుల్లో 4522 మంది సంతకాలతో ఒక పెద్ద అర్జీ అసోసియేషన్ పక్షాన ప్రభుత్వానికి పంపబడింది.

3, నవంబరు రిజిస్ట్రేషన్ కోసం అర్జీలు తీసుకోవడం ఆపివేశారు.

11. నవంబరు - మొట్టమొదటిసారి సత్యాగ్రహుల అరెస్టులు ప్రారంభమయ్యాయి.

27. డిసెంబరు : కోర్టులో హాజరుకు సిద్ధంగా వుండమని గాంధీ గారికి హెచ్చరిక వచ్చింది.

28. డిసెంబరు : జోహన్స్‌బర్గులో శ్రీ జార్డన్, గాంధీ గారిని 48 గంటల్లో ట్రాన్స్‌వాల్ వదిలి వెళ్లమని ఆదేశించాడు.

1908

10. జనవరి : జోహన్స్ బర్గ్ నందు శ్రీ జార్డన్ గాంధీ గారికి రెండు మాసాల సాదా జైలు శిక్ష విధించాడు.