పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/304

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

285


ధర్మం అనిపించింది. అందువల్ల అనుమతించాను నేను దాన్ని చంపటానికి అనుమతించి ఏదో చెడ్డ పని చేశానని యీ సంఘటన గురించి వ్రాస్తున్నపుడు కూడా నేను అనుకోవటం లేదు. పామును చేతితో పట్టుకొనేశక్తిగాని లేదా ఆశ్రమ వాసులను పాములపట్ల నిర్భయంగా వ్యవహరించేలా చేసే శక్తిగాని నాలో లేదు. ఇప్పటికీ ఆ శక్తిని పెంపొందించుకోలేక పోయాను

టాల్‌స్టాయ్ ఆశ్రమంలో సత్యాగ్రహుల రాకపోకల వెల్లువ వుండేదని పాఠకులిప్పటికి చాలా సునాయాసంగా అర్థం చేసుకుని వుంటారు. జైలుకు వెళ్ళేవారు గానీ జైలు నుంచి వచ్చేవారు గానీ ఆశ్రమంలో వుంటూనే వుండేవారు. ఒకసారి యిద్దరు సత్యాగ్రహులు స్వంత పూచీకత్తుపై ఆశ్రమానికి వచ్చారు. రెండవ రోజు తీర్పు వినేందుకు కోర్టుకు వెళ్ళవలసి వున్నది. వాళ్ళు మాట్లాడటంలో బహు నేర్పరులు ఇంతలో వారు పట్టుకోవలసిన ఆఖరిరైలుకి సమయం మించిపోయింది. ఇప్పుడిక వారారైలుకి వెళ్ళగలరా లేదా అన్నది ప్రశ్న. వారు యిద్దరూ యువకులు కసరత్తులో కుశలురు వాళ్ళు వాళ్ళకి వీడ్కోలు పలికేందుకు మాలో కొందరు స్టేషన్ పరుగెత్త నారంభించారు రైలు వచ్చే ముందు రైలు బయలు దేరేముందు శబ్దాలను నేను విన్నాను. అప్పటికి స్టేషన్ ముఖద్వారం దగ్గర వున్నాము. వారిరువురూ వేగంగా ముందుకు వెళ్ళి పోయారు. నేను వెనుక బడ్డాను. రైలు బయలు దేరింది

కానీ యీ యువకులను గమనించిన స్టేషను మాస్టరు రైలును ఆపించి యీ యిద్దరినీ అందులో కూర్చోబెట్టించారు. నేను స్టేషన్ చేరుకుని అతనికి ధన్యవాదాలు సమర్పించాను. ఈ పంఘటన వ్రాసేటప్పుడు నేను రెండు విషయాలపై దృష్టిని కేంద్రీకరించదలచాను ఒకటి సత్యాగ్రహంలు జైలుకెళ్ళి, తిరిగి వచ్చినా తమ మాటనిలబెట్టుకునేందుకై తిరిగి వెళ్ళడంలో వారి ఉత్కంఠ. రెండుస్థానిక అధికారులతో సత్యాగ్రహులు పెంచుకున్న అనుబంధం ఆ యిరువురూ ఆ రోజు రైలు అందుకొనక పోయి వుంటే కోర్టుకు హాజరు కాలేక పోయేవారు. వారికెవరూ పూచీకత్తు యివ్వలేదు. కోర్టు వారు, వారి వద్ద జమానతు రూపంలో డబ్బు వసూలు చేయలేదు. కేవలం వారి నిజాయితీ పట్ల నమ్మకంతోనే వారిని వదలటం జరిగింది. జైలు కెళ్ళేందుకు