పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/249

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

అనుమతి పత్రాల హోళీ


అప్పగించబడ్డాయి. పెద్ద బాణీలో వాటిని పుంచి, కిరోసిన్ కుమ్మరించి యూసుఫ్‌మియా నిప్పంటించారు. సభికులందరూ లేచి నుంచకున్నారు అవన్నీ కాలిపోయే వరకూ సభాస్థలి కరతాళధ్యనులతో మారుమ్రోగిపోయింది ఇప్పటిదాకా తమ అనుమతి పత్రాలను తమ దగ్గరే వుంచుకున్న వారెంతోమంది వాటిని వేదికపైకి విసిరివేయటం మొదలెట్టారు. వాటిని కూడా మంటలో వేయసాగారు ఎందుకిలా చేశారని వారిని ప్రశ్నిస్తే తగులబెట్టే సమయంలో సరిగ్గా వాటినలా చేస్తే తక్కి సవారికి ఉత్తేజం కలుగుతుందని తలిచి తామిలా చేశామని వారన్నారు. మరి కొంతమంది నిజం ఒప్పుకున్నారు. మీలా చేయటానికి మాకు ధైర్యం చాల లేదు. చివరి క్షణందాకా యీ కాల్చివేత కార్యక్రమం జరుగకపోవచ్చుననే నమ్మకం వున్నది కానీ కాలుతున్న ఆజ్ఞాపత్రాలను చూస్తూ మేము ఆగి వుండలేకపోయాము వీళ్ళందరికీ ఏమైతే మనకూ అదే అవుతుందనుకుని నిర్ణయానికి వచ్చాము అని వాళ్లు అన్నారు. సత్యాగ్రహ సమరంలో యీలాంటి సత్యభాషణల స్పష్ట వ్యకితి కరణ అనుభవాలు ఎన్నో కలిగాయి

ఆంగ్ల పత్రికా విలేఖరులు కొంతమంది యీ సభకు వచ్చారు. ఆ సభా దృశ్యపు ప్రగాఢముద్ర వారిపై పడింది. తమ పత్రికల్లో సభ గురించి వాస్తవ వర్ణనలు వారు చక్కగా ప్రకటించారు. ఇంగ్లాండు నుంచి వెలువడే డైలీమైల్ అన్న పత్రికకు చెందని జోహాన్స్‌బర్గ్ ప్రతినిధి యీ సంఘటన గురించిన వివరాలన్ని తన పత్రికకు పంపాడు. ఇంగ్లాండు నుంచి పంపబడిన తేయాకు పెట్టెలను అమెరికా వాసులు బోస్టన్ నౌకాశ్రయంలో సముద్రంలో ముంచి ఇంగ్లాండ్ ఆధీనంలో తోము వుండబోమని ప్రకటించిన తీరుతో యీనాటి సన్నివేశాన్ని పోల్చాడా విలేఖరి ఓవైపు 13 వేల మంది నిరాశ్రితులైన భారతీయులు, మరోవైపు శక్తిపంతమైన ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం యిదీ యిచ్చటి దక్షిణాఫ్రికా స్థితి అన్ని విధాలా నిపుణలైన లక్షలాది తెల్లజాతి ప్రజలు ఒకవైపు, మరోవైపు అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ ప్రభుత్వం ఇదీ అక్కడి స్థితి ఈ పరిస్థితులను పోల్చి చూపటంలో డైలీమైల్ పాత్రికేయుడు