పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/248

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

229


నిర్ణయాన్ని యీ విధంగా తెలిజేస్తున్నాం . ఒకవేళ యీనాటి ---- కార్యక్రమంలో పాల్గొన్న వారెవరైనా రేపు వెళ్ళి కొత్త అనుమతి పత్రాలు . తెచ్చుకోవాలన్న నిర్ణయం తీసుకున్నా, వారిని ఆపే వారెవరూ యిక్కడ లేరు. ఈ చర్యయొక్క పరిణామాల్ని ఎదరుర్కొనే శక్తి తమకు లేదేమోనని అనుమానించే వారికి యిప్పటికీ వెనక్కి మళ్ళే అవకాశం వున్నది. ఇప్పుడి నిర్ణయం తీసుకోదలచినవారు సిగ్గుపడాల్సిన అవసరమేమీ లేదు. దీన్ని నేను ఓరకమైన సాహసమేనని అంటాను కానీ దీని తరువాత నిర్ణయాన్ని మార్చుకో తలిస్తే అది నిజంగా సిగ్గుపడవలసిన పరిస్థితి దానివల్ల జాతికి నష్టం కలుగవచ్చు. ఇంతేకాక, యీ యుద్ధం సుదీర్ఘంగా సాగుతుందని జాతి తెలుసుకోవలసిన తరుణమిది. మనలో కొంతమంది ప్రతిజ్ఞ నుంచి సడలిపోయారన్న విషయం తెలుసు ఇప్పుడిక యీ బండిని, మిగిలియున్న వారితోనే లాగించటానికి ఎక్కువ శ్రమ పడవలసి వుంటుందన్న సంగతి సుస్పష్టం. ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా ఆలోచించిన తరువాతే యిప్పటి యీ సాహసాన్ని చేయటానికి పూనుకోమని సలహాయిస్తున్నాను

నా ప్రసంగం కొనసాగేటప్పుడే సభామధ్య సుంచీ, "మాకా అనుమతి పత్రాలు అవసరం లేదు. మేము వాటిని కాల్చివేస్తాం" అన్న 'కేకలు వినవచ్చాయి. నా ప్రసంగం చివర్లో ఈ నా తీర్మానాన్ని వ్యతిరేకించే వారు లేచి నిల్చోవచ్చునని ప్రజలకు తెలియజేశాను. కానీ ఒక్కరూ నిలబడలేదు. మీర్ ఆలమ్ కూడా సభలో వున్నాడు నా పై దాడి చేయటం తాను చేసిన పెద్ద తప్పని సభాముఖంగా కాల్చివేయమని అతడు నాకు యిచ్చాడు. కొత్త ఆజ్ఞాపత్రాన్ని అతడు స్వచ్చందంగా తీసుకోలేదు. మీర్ ఆలమ్ చేతిని నాచేతుల్లోకి తీసుకుని ఆనందంతో మెత్తగా నొక్కాను నా మనసులో అతనిపట్ల ఏ ఆవేశకావేశమూ లేదని మరోసారి స్పష్టం చేశాను తన తప్పు ఒప్పుకుని తన అనుమతి పత్రాన్ని కాల్చి వేసేందుకు అతను యివ్వగానే సభికుల ఆనందానికి అంతు లేకుండా పోయింది.

2000లకు పైగా అనుమతి పత్రాలు కాల్చివేసేటందుకై కమిటీకి