పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/201

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

ఒడంబడికకు వ్యతిరేకత


పరిస్థితి అసామాన్యంగా వుంటుంది. దుఃఖకరంగా వుంటుంది. మనిషికి యిటువంటి సమయంలోనే పరీక్ష జరుగుతుంది. యిది నాకు కలిగిన అనుభవం యిలాంటి సమయంలో ఉన్నతమైన ఆధ్యాత్మిక సంపదను పొందగలిగాను పోరాట సమయంలో సత్యాగ్రహ స్వరూపాన్ని అర్ధాన్ని తెలుసుకోలేని వాళ్లు, పోరాటం ముగిసిన తరువాత ఒప్పందం జరిగినప్పుడు తెలుసుకోగలిగారని చెప్పవచ్చు ఒప్పందం గురించిన వ్యతిరేకత పరాన్ల వరకే ఆగిపోయింది

రెండుమూడు మాసాలు గడిచాయి. ఏషియాటిక్ ఆఫీసు ఐచ్ఛిక అనుమతి పత్రాల్ని యివ్వడానికి సిద్ధమైంది. పత్ర స్వరూపం పూర్తిగా మారిపోయింది. క్రొత్త రూపం తయారు చేసేటప్పుడు సత్యాగ్రహ మండలివారితో సలహా సంప్రదింపులు జరిపారు

ది 10 2 1908 నాటి ఉదయం మాలో కొందరం పత్రాలు తీసుకొనుటకు ఏషియాటిక్ ఆఫీసుకు బయలు దేరాము పత్రాలు తీసుకొనే పనిని త్వరలో ముగించాలని జనానికి ముందే బోధించడం జరిగింది. సలహా సంప్రదింపుల తరువాత మొదటి రోజున పత్రాలు తీసుకునేందుకు నాయకులు వెళ్లాలని నిర్ణయం చేశారు. ప్రజల సందేహాల్ని నివృత్తి చేయడం, ఏషియాటిక్ ఆఫీసు అధికారులు మర్యాదగా వ్యవహరిస్తున్నారో లేదో చూడటం, యితరత్రా కూడా అవ్యవహారాల్ని జాగ్రత్తగా పరిశీలించి చూడటం మన వాళ్లకు ముఖ్యం నా ఆఫీసు సత్యాగ్రహమండలి ఆఫీసే అక్కడికి వెళ్లాను ఆ ఆఫీసు బయట మీర్ ఆలం, అతని మనష్యులు నిలబడి వుండటం గమనించాను

మీర్ ఆలం నా పాత కక్షిదారే తన ప్రతిపనికీ నన్ను సలహా అడిగేవాడు పరాన్లు ట్రాన్స్ వాలులో గడ్డి మరియు కొబ్బరి పీచులతో దిండ్లు, పరుపులు తయారు చేయించి అమ్ముతూ వుంటారు. మంచి లాభాలు గడిస్తూ వుంటారు మీర్‌ఆలం వృత్తికూడా అదే అతడు ఆరు అడుగుల ఎత్తుగల, ఒడ్డూ పొడవు గల మంచిబలిష్ఠుడు ఆఫీసులోకి రాకుండా బయటే నిలబడటం,