పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/149

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

ఇంగ్లాండులో ప్రతినిధిబృందం


మొహమాటానికి కాకుండా హృదయపూర్తిగా మాకు సహకరించేందుకు అంగీకారం తెలిపారు. వారు కాగితాలన్నీ చదివారు. మా పరిస్థితుల్ని బాగా అర్థంచేసుకున్నారు. ఇంకా యితర ఆంగ్లోఇండియన్లను యితర పెద్దల్ని కలిశాము సాధ్యమైనంత వరకు ఎవ్వరినీ వదల లేదు. మా ప్రతినిధి బృందం స్వరూపం మారిపోయింది అంతా వెళ్లిలార్డ్ ఎల్గిన్‌ను కలిశాము మాటలన్నీ శ్రద్ధగా విన్నారు. తన సానుభూతిని ప్రకటించారు. తన యిబ్బందులు కూడా తెలియజేశారు. దానితోబాటు శక్త్యాను సారం మీరు తప్పక సహకరిస్తానని మాట యిచ్చారు. మా ప్రతినిధి బృందం లార్డ్ మోర్లేని కూడా కలిసింది వారు కూడా చూ యెడ సానుభూతి చూపించాడు. వారి మాటల సారం ముందే తెలియజేశాను సర్ విలియం వెడ్‌బర్న్ గారి కృషి వల్ల భారత దేశ వ్యవహారాలతో సంబంధం వున్న బ్రిటిష్ లోకసభ సభ్యుల సమావేశం ఒకటి అక్కడి లోకసభ దర్బారు హాల్లో జరిపాము మేము వారందరికీ సభాముఖంగా మాగోడు వినిపించాము అప్పుడు ఐరీష్ పార్టీ నాయకుడుగా శ్రీ రెడ్‌మండ్ వున్నారు. ప్రత్యేకించి వెళ్లివారిని కూడా కలిశాము. బ్రిటిష్ లోక సభకు చెందిన అన్ని పార్టీల ముఖ్యమైన మెంబర్ల నందరిని కలిశాము ఇంగ్లాండులో మాకు భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ కమిటీ వారి సహాయం అమితంగా లభించింది. అయితే అక్కడ ఒక యిబ్బంది కలిగింది. ఆకమిటీ సమావేశాల్లో కొందరు, కొన్ని భావాలుకల వారు మాత్రమే పాల్గొంటూ వుంటారు. ఆ సమావేశాల్లో పాల్గొనని వాళ్లు చాలా మంది మాకు అమితంగా సాయం చేశారు. అట్టివారందరినీ ఒక చోట కలిపి, వారందరి సహకారంతో, ఐక్యతతో పనిచేస్తే మాకృషి ఫలిస్తుందని భావించాము అందుకు అంతా సంతోషంతో అంగీకరించారు. ఒక స్థాయీ సమితి ఏర్పాటుకు పూనుకున్నాము

ఏ సంస్థకైనా ముఖ్యుడు కార్యదర్శి ఆసంస్థ లక్ష్యాల యెడ పూర్తిగా విశ్వాసంగల వ్యక్తియే ఆ సంస్థకు కార్యదర్శిగా వుండాలి అతడు పూర్తి సమయం ఆ సంస్థపనులకోసం వెచ్చించాలి. సంస్థను సడపగల శక్తి కలిగి యుండాలి ఎ.ఎల్.వాచ్. రిచ్ యందు పైగుణాలన్నీ వున్నాయి. వారు