పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/108

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

91


తెలియజేస్తాము అప్పుడు మీరు వెంటనే దక్షిణాఫ్రికా వచ్చితీరాలి అట్టి షరతుపైమీరు భారతావని వెళ్లవచ్చుననీ వారంతా చెప్పారు. ఓడ యాత్రకు అయ్యేఖర్చు, నాకుటుంబానికి అయ్యేఖర్చు భారతజాతి భరిస్తుందని వాళ్లు మాట యిచ్చారు. వారి షరతును అంగీకరించి నేను ఇండియాకు తిరిగివచ్చాను

బొంబాయిలో బారిస్టరీ ప్రారంభించాలని అనుకున్నాను కీ॥శే॥ గోఖలేగారి సలహా, సంప్రదింపులతో ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించాలనేది అందుకుగల ఒకకారణం జీవన నిర్వహణ రెండవ కారణం అందుకై బొంబాయిలో నేను కొద్ది గదులు అద్దెకు తీసుకున్నాను నావకాల్తా కూడా కొద్దిగా పుంజుకున్నది. దక్షిణాఫ్రికా యందలి భారతీయులతో నాకు విడదీయరాని సంబంధం ఏర్పడి పోయింది. అందువల్ల అక్కడి నుంచి భారతావనికి తిరిగివచ్చిన మిత్రులే అమితంగా కోర్టు వ్యవహారాలు నాకు అప్పగించారు. వారివల్ల జీవన నిర్వహణకు తేలికగా ఏర్పాటు జరిగిపోయింది కాని నా జీవితంలో శాంతిసౌఖ్యాలు వ్రాసి లేవు మూడునాలుగు మాసాలు బొంబాయిలో గడిపానోలేదో, యింతలో దక్షిణాఫ్రికా నుంచి “ఇక్కడి పరిస్థితి తీవ్రంగా వున్నది శ్రీ ఛేంబర్లేన్ కొద్ది రోజుల్లో వస్తున్నారు. మీరు యిక్కడ వుండటం అవసరం' అని తంతి వచ్చింది

వెంటనే నేను బొంబాయి యందలి ఆఫీసును, నివాసాన్ని పదిలివేశాను దక్షిణాఫ్రికాకు బయలుదేరాను. 1902వ సంవత్సరం గడిచిపోతున్నది. 1901 చివరి రోజుల్లోబొంబాయిలో ఆఫీసు తెరిచాను తంతిద్వారా అక్కడి వాస్తవ పరిస్థితిని నేను గ్రహించలేకపోయాను ట్రాన్స్‌వాల్‌లోనే ఏదో విపత్కర స్థితి ఏర్పడి వుంటుందని ఊహించాను కుటుంబాన్ని ఇండియాలోనే వుంచాను మూడు నాలుగుమాసాల్లో తిరిగి రావచ్చని అనుకోవడమే అందుకు కారణం కాని డర్బన్ చేరిన తరువాత అక్కడి సంగతులు విని నివ్వెరబోయాను బోయర్ యుద్ధం తరువాత దక్షిణాఫ్రికా యందలి భారతీయుల స్థితిగతుల్లో ఎంతో మార్పు వస్తుందని అంతా భావించాము ముఖ్యంగా ట్రాన్స్‌వాల్, ఆరంజ్‌ఫ్రీస్టేట్‌లో ఏ విధమైన ఆపదరాదని భావించాము. బోయర్ యుద్ధం ప్రారంభమైనప్పుడు లార్డ్ లెన్స్ డౌనన్, లార్డ్ సెల్‌బర్న్. బ్రిటిన్‌కు చెందిన