పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/9

ఈ పుటను అచ్చుదిద్దలేదు

10

ఇందులకు ప్రబలముగ శ్రీనాథమహాకవిరచితమై వల్లభరాయని కృతిగా పేర్వెలసిన క్రీడాభిరామమున త్రిపురాంతకుని ప్రశంసగలదు,

ఉ. నన్నయభట్టు, తిక్కకవినాయకుఁ డన్న ,హుళిక్కి భాస్కరుం
     డన్ననుఁ, జిమ్మపూడి యమరాధిపుఁ డన్నను సత్కవీశ్వరుల్
     నెన్ను దుటం గరాంజలులు నింతురు 'జే' యని రావిపోటి తి
     ప్పన్నయుసంతవాఁడ! తగునాయిటుదోసపుమాటలాడగన్.

మఱియు నీత్రిపురాంతకుడు సంస్కృతమున రచించిన ప్రేమాభిరామము సనుసరించి తెనుఁగున శ్రీడాభిరామము రచియించిన ట్లాగ్రంథమునఁ గలదు.

“దిప్పమంత్రీంద్రతనయుఁ డార్య మణివల్లభామాత్యుఁడహరహంబు."

వ. ఆమంత్రి శేఖరుండు రావిపాటిత్రిపురాంతక దేవుఁడను కవీశ్వరుఁ డొనరించిన ప్రేమాభి రామనాటకము ననుసరించి క్రీడాభిరామంబను రూపకంబు తెలుఁగుబాసను రచియించినాఁడు.”

వల్లభరాయనితండ్రి తిప్పన కర్ణాటరాజ్యమును పరిపాలించిన మొదటి హరిహరరాయని రత్నభాండాగారాధికారి యగుటచేతను, నాతనిపెదతండ్రి లింగన రెండవహరిహర


(1) ఆంధ్రదేశమున భాస్కరులచరిత్రమునుఁ దెలిసికొనఁగోరువారీక్రిందిగ్రంధములఁ జూడనగును.

1. ముప్పదియిద్దఱుమంత్రులచరిత్రము (1889)

2. భాస్కరోదంతము- కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగారు (1893)

3. రాయసభాస్కరమంత్రిచరిత్రము - గురుజాడ శ్రీరామమూర్తి గారు (1900)