పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/8

ఈ పుటను అచ్చుదిద్దలేదు

9

డపునాశ్వాసమున ననుస్వారసంబంధయతి కుదాహరణముగా నీ క్రిందిపద్యము దాహరింపఁబడి యున్నది.

మ. సరిబేసై రిపుడేలభాస్కరులు భాషానాథ! పుత్రా! వసుం
     ధరయం దొక్కడు మంత్రియయ్యె వినుకొండన్ ; రామయామాత్యభా
     స్కరుఁడో! ఔ, నయిన స్సహస్రకరశాఖల్లే వవేయున్న వే
     తిరమైదానము సేయుచో, రిపుల హేతిన్ర్వే యుచో, వ్రాయుచోన్.

పైపద్యమునందలిపాఠము ముప్పదియిద్దఱుమంత్రులచరిత్రమున రాయనామాత్య భాస్కరుఁడని యున్నది. ఇదియ సరియగుపాఠము. ఈ భాస్కరులు పెక్కుఱు గలరు. వారిలో నీరాయనిభాస్కరుఁడు దాతృత్వమున తెలుగునాటఁ బేరెన్నికఁగన్న వాఁడు ఈతనిఁగూర్చి భట్రాజులు చెప్పినపద్యములు చాల గలవు, గ్రంథవిస్తరభీతి నుదహరింప మానితిని. ఈతఁడు క్రీ. శ. 1386 సంవత్సరప్రాంతమున రాజమహేంద్రవరమును పరిపాలించిన రెడ్డిరాజు కాటయవేముని యాస్థానమున నున్నట్లీ క్రిందిపద్యమువలనఁ దెలియుచున్నది.

చ కలయఁ బసిండిగంటమునఁ గాటయవేము సమక్షమందు స
   త్ఫలముగ రాయనిప్రభుని బాచఁడు వ్రాసిన వ్రాల మ్రోతలున్
   గలుగలు గల్లుగల్లురన గంటకమంత్రుల గులడెలన్నియున్
   జలుజలు జల్లుజల్లురనె సత్కవివర్యులు మేలుమేలనన్ .

రాయని భాస్కరుని స్తుతియించిన త్రిపురాంతకుఁడు శ్రీ. శ. 1380 ప్రాంతమువాఁడు గావలెను.