పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/7

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

రాంతకునితరకృతులు సంపూర్ణముగ దొరకినచోఁ గొంత తెలియును గాని వానియందు కొన్ని పద్యములే లభించుచున్నవి గావున నీతనిచరిత్రము నిగూఢ మైయున్నది.

జన్మముచే నెవ్వఁడైనను భక్తిప్రపత్తియం దీతఁడు శైవుఁడని చెప్పనొప్పును. ఈయుదాహరణమునందలి శైవసంప్రదాయాభిజ్ఞతయందేమి, ప్రాచీనశివభక్తకథాసూచనమునందేమి కవి శైవుఁడగుట స్పష్టమే! పేరు శైవులదే! ఈతఁడు శ్రీశైలమునకుఁ దూర్పువాకిలియగు త్రిపురాంతకక్షేత్రమున జనించి తద్దేవునకు భక్తుఁడై శృంగారకావ్యములను భక్తిరసప్రధానములగు కావ్యములు రచియించె నని రెండవప్రతాపరుద్రునికాలమువాఁ డని శ్రీరామకృష్ణకవిగారు త్రిపురాంతకోదాహరణము తొలికూర్పునను మలికూర్పుననుగూడ వ్రాసియున్నారు. దీని కాధార మూహ్యము.

4. కాలనిర్ణయము

శ్రీరామకృష్ణ కవిగారు, త్రిపురాంతకుఁడు ద్వితీయప్రతాపరుద్రునికాలమువాఁడని వ్రాసినారు. త్రిపురాంతకుఁ డనుకవి ద్వితీయప్రతాపరుద్రునియాస్థానమున నున్నట్లు ప్రతాపచరిత్రమునఁ[1] గలదు. కాకతీయచక్రవర్తులలోఁ గడపటివాఁ డగు నీప్రతాపరుద్రుఁడు క్రీ. శ. 1295 మొదలు 1326 వఱకుఁ బరిపాలించినవాఁడు. కావున నీతఁ డాకాలమువాఁడు కావలెను. కాని దీని కొకప్రతిబంధకము గలదు. రావిపాటి తిప్పన్న చాటుధార యని యప్పకవీయమున యతిప్రాసవిషయికమగు మూ

  1. ప్రతాపచరిత్రము-ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక. 7. సంపుటము. 7. పుట.