పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/67

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

గము రవణంబు, చంద్రుఁడు శిఖాకుసుమంబటె, యెవ్వరీ డుమా
    రమణునకుం గుమారగిరిరాజనివాసున కన్యదైవముల్.

కళిక - హయప్రచారము లేక తురగవల్గనము రూపకతాళము

మఱియు మెఱయు వేదవాద - మథనకథనసారమునకు
మెఱయు దొట్టముట్టి ముట్టు - మేటినీటితీరమునకు
బత్తు లుత్తు లొరసి యొకసి - పట్టు గట్టితేజమునకు
సత్తుఁ జిత్తు దాన యైన - సత్యనిత్యబీజమునకు
వలచి కొలుచువారిఁ జేరి - వలపుదలఁపు దయ్యమునకు
నిలిచి నిలిచి చూడఁ జూడ - నిండియుండు తియ్యమునకు
మునులు ఘనులు బోధవీధి - ముట్టినట్టి తత్త్వమునకు
పనులఁ గనులు నెఱుఁగనట్టి - పరమపదమహత్త్వమునకు.

ఉత్కళిక

కదలి వదలి జూటకోటి
చదలఁ బొదల నేటినీటి
కడలఁ గడలఁ జెంది చెంది
జడల నొడలఁ బొంది పొంది
బాలలీలఁజూడఁజూడ
సోలి లీలఁ గ్రీడలాడ
నాదినాథజనకమునకు
[1]వాదపూరికనకమునకు.

  1. వాతపురి - సంస్కృతము - (చిదంబరము-) రసవాదపుటూ రని ద్రావిడోత్పత్తి.
    కరిశాల చక్రవర్తి కీశ్వరుఁడు పసిఁడివాన గురియించినాఁడు.
    ఉత్కళికయం దీశ్వరునియష్టమూర్తిత్వము వర్ణితము - చూ. శాకుంతలము నాందీశ్లోకము - ‘యాసృష్టీత్యాది’—