పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/64

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

63

యీలుపుగల సద్భక్తులు ముక్తికి - నేఁగెడు చేరువపెనుత్రోవకునై
కూటికిఁ గూరకు భక్తులఁగూరిమి - కొడుకుల నడిగెడు వెడజోగికినై
ఏటికి బోటికి జడలును నోడలును - నిచ్చినజగదేకత్యాగికినై
ప్రొద్దును రేవెలుఁగును నేత్రములై - పొలయఁ గనుంగొడియెడు దేవునకై
నిద్దము లగుపెద్దలపే రెఱుకల - నెలకొనియెడు నిశ్చలభావునకై.

ఉత్కళిక

కడుదీనతతో ముదితాపసికై
వడి నింటికిఁ జని వెడకప్పెరకై
కొని యాలుమగలఁ బెనురచ్చలకై
చనుదెండని నిక్కము సేయుటకై
వెనుద్రిప్పిన గుండములోపలఁ గై
కొని చని తన యెప్పటిరూపముకై
కొని గుండయ మెచ్చినవేల్పునకై
వినత పితామహఫణితల్పునకై.

కళిక - తొలిపాదము - దిగంబరుఁడని చెప్పుటకు మాఱుగ కవి యిట్లు చమత్కరించినాఁడు.

రెండవ పాదము - బాణునికి లింగావసరకాలమున నీశ్వరుడు వాకిటి కాఁపులవాఁడుగా నున్న కథ బసవపురాణము 4.వ ఆశ్వాసమునగలదు. (132-పుట)

ఉత్కళికయందు గుండయ్యచరిత్రము సూచింపఁబడినది.

బసవపురాణము - 4ఆ - 139 పుట.

గుండయయను భక్తుఁ డొకనాడు తిరునీలకంఠదేవునిగుడినుండి వచ్చుచున్నప్పుడు దారిలో నాతనిపై, మేడపైనుండి