పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/63

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

    విజ్జోడుపడి విచ్చవినువీథిఁ దిరిగెడు
                     చక్రంబు లొనఁగూడ సంఘటించి
    తలకొన్నభీతి కొందలపడ బహుముఖ
                     భ్రాంతసారథి నేరుపరిగ నిలిపి
    పలుకపదక్రమంబుల నలుజాడల
                     బోయెడు గుఱ్ఱముల్ పూనుకొలిపి
    కుంటివింటనుఁ బలువంకఁగోలఁ దోడిగి
    విషమలక్ష్యంబు లేగతి వేసి తయ్య
    వేల్పు లెవ్వరు నీసాటి విజయవాటి
    మల్లికార్జునలింగ! ఉమాప్రసంగ.

(బొడ్డపాటి కొండయ)

చతుర్థివిభక్తి

ఉ. ఆఱడియాస నీరసధరాధిపలోకము లిండ్లు వాకిళుల్
    దూఱుట మాని శ్రీనగము తూఱుపువాకిలిఁ జొచ్చి పాపముల్
    నీఱుగఁ జేసి గంధవతి[1] నీటనుఁ గ్రుంకి మనంబులోని చి
    చ్చాఱఁగఁజేయు టొప్పు త్రిపురాంతక దేవునకై నమస్కృతుల్.

కళిక - వృషభగతిరగడ. త్రిపుట తాళము

మఱియును మెఱయఁగ దిశలనియెడు మను-మడుఁగులుగట్టిన శృంగారికినై
కొఱలినదయ బాణాసురుమోసల - కూరిమిఁ గాచిన ఫణిహారికినై
మేలపుఁజదువులు చదివిన విని మది - మెచ్చినలక్ష్మీపతి బావకునై

  1. ఈపద్య మప్పకవీయమున నుదాహరింపఁబడియున్నది. ద్వి. ఆ. 214 పద్యము, గంధవతి త్రిపురాంతకమునందలి తీర్థము.