పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/60

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

61

కళికవివరణము

1. ఈశ్వరుఁడు గంగను ధరించినకథ శిపపురాణప్రసిద్ధమే. 2 కన్నప్ప యనుశివభక్తుఁడు తనపుక్కిటనీటితో శివు నభిషేకించి సాయుజ్యమునుఁ బొందినకథ బసవపురాణమునఁ గలదు. ధూర్జటి శ్రీకాళహస్తిమాహాత్మ్యకథలోఁ గూడఁ గలదు.

(తృ ఆ.)

3. సేనమరాజు- చేరమచక్రవర్తి. . . మహాగోదుఁ డనినామాంతరము- శైవభక్తుఁడు. 4. సాఖ్యతొండడు. ఈభక్తుఁడు శాక్యుఁ డగుటచే సాక్యతొండఁ డనియుండుట సరి. బసవపురాణమున సాంఖ్యతొండఁ డని కలదు. ఈతని కథయందు షష్ఠాశ్వాసమున[1] వర్ణితము. త్రిపురాంతకుడు ప్రాసస్థానమున నీపదము సౌఖ్య యనుదానితోఁ గుదురుపఱచుటచే నిదియే సాధురూపముగా నెన్నఁదగినది.

ఉత్కళిక యందు మారసంహారము వర్ణితము.

తృతీయావిభక్తి

ఉ. వాలి నటించు ముక్తి వరవర్ణినిపయ్యెదకొంగు చాడ్పునం
    గ్రాలునిజాంకపుంబడగఁ గన్నులఁ జూచిన జాలు, నిమ్నగా

  1. బౌద్ధదంపతులకుఁ బుట్టిన శాఖ్యతొండఁడు శివభక్తిపరుఁడై శివాలయమున ముప్పూటలు మూఁడు ఱాలతో శివపూజ సేయుచుండ నొకతఱి నేడురోజులు వర్షము గురియుటచే నాలయమునకు బో వీలు లేక నుపవాసముండి యేడవనాఁడు నాఁడొకఱాయియు దొరకకపోవుటచే నొకపెద్దబండ నెత్తి, శివునిఁ బూజించెను. శివుఁడు ప్రత్యక్షమై సాయుజ్య మిచ్చెను.