పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/6

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7

ఇట్లే శ్రీ గిడుగువారు తాము ప్రకటించిన [1]యప్పకవీయమున త్రిపురాంతకోదాహరణముఁ గూర్చి యిట్లు వ్రాసియున్నారు. “త్రిపురాంతకోదాహరణము.” ఇది యెనిమిది తాటాకులపుస్తకము. గ్రంథకర్త గుండయకవి.

ఇందు గ్రంథకర్త గుండయకవియనుట పొరపాటే! గుండయప్రాచీనశైవభక్తుఁడు. గుండయపేరు చతుర్థీవిభక్తి యుత్కళియం దుదాహరింపఁబడినది. ఈతనిచరిత్ర బసవపురాణమున వర్ణితము. ఈ గ్రంథము శైవసంప్రదాయిక మగుటచేతను, సందర్భానుసారముగ నాయాభక్తులచరిత్రము లుద్ధరింపఁబడుట చేతను, వారిచరిత్రము లాంధ్రసాహితీవేత్తలకు సుపరిచితములు గాకపోవుటచేతను గ్రంథకర్తనుఁగూర్చి యిట్టి వేరుపాటు గలిగినది. త్రిపురాంతకుఁడే గ్రంథకర్త యనుట నిర్వివాదాంశము.

3. కవిజీవితము

రావిపాటి త్రిపురాంతకుని వాడుకపేరు తిప్పన[2]. తెలుఁగుకవులలో నీతనిచరిత్రము బహుసులభముగా వ్రాయవచ్చును. ఏలయన నితనిపేరు తప్ప, తలిదండ్రులపేళ్లుగాని కులగోత్రవిద్యావిషయము లితరము లేవియఁ దెలియరావు. త్రిపు

  1. అప్పకవీయము వావిళ్లవారిముద్రణము 19 24 అప్పకవి ఉదహరించిన గ్రంధములు. అందులోని పద్యములు 3 పుట యడుగున యథోజ్ఞాపిక.
  2. భాస్కరశబ్దమునకు బాచన్న, తిరుమలశబ్దమునకు దిమ్మన, త్రిపురాంతకునికిఁ దిప్పన్న, జగన్నాథశబ్దమునకు జగ్గన్న ఆదిత్యునకు నైతన భైరవునకు బయ్యన్న వికృతరూపములు.