పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/59

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

బొలఁతితో నొక్కొడలఁ - బొత్తుఁగూడినవానిఁ
దలఁకి సేనమరాజు - దాడి కోడినవాని
శాఖ్యతొండని రాల - జడికి నోర్చినవాని
సౌఖ్యతరసాయుజ్య - సరణిఁ దీర్చినవాని
వెన్నెలలఁ బురుణించు - వెలఁదినవ్వులవాని
వెన్నునకు నలువకును - వెదక దవ్వగువాని.

ఉత్కళిక

చిగురుఁగైదువు వెఱికి
మగలసిగ్గులు నఱికి
సతులఁ బాటులుపఱిచి
యతుల వ్రతములు చెఱిచి
ఆలలు చిలుకలు బండు
లెలయఁ గొలువగ నుండు
మరు జయించినవానిఁ
గరుణ మించినవాని.

పద్యవివరణము

అచ్చులోనున్న 'బొట్టు ' అను పాఠముకన్న 'సేస' యనుపాఠము శ్రేష్ఠము. జగ్గన ప్రబంధరత్నాకరమున నుదాహరించిన యీ పద్యమున 'సేస' యనుపాఠమే గ్రహించియున్నాఁడు. చంద్రుఁ డీశ్వరునికి శిరోభూషణ మైనను, సర్ధనారీశ్వరుఁ డైనపుడు చంద్రఖండము 'సేస' వలె సీమంతమున నుండును. అర్ధనారీశ్వరత్వ మిందు ధ్వనితము.

దువ్వలువు- రెండువలువలు- వలువు ప్రాచీనరూపము. (దుగ+వలువు)-