పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/57

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

పంచాక్షరికి షడక్షరి యని పేరు [1]మంత్రకుసుమమున బీజాక్షరములు రేకులుగా మంత్రాధిదైవతమును దుమ్మెదగాఁ బోల్చుభావము త్రిపురాంతకమహాకవికిఁ బూర్వమునుండియుఁ బ్రచారములో నున్న 'తుమ్మెద'పదములలోఁ గలదు.

తుమ్మెదపదములు పండ్రెండవశతాబ్దమునఁ బ్రచారములోనున్నట్లు పండితారాధ్యచరిత్రమువలనఁ దెలియవచ్చును.

“పదములు తుమ్మెదపదము ల్ప్రభాత
పదములు పర్వతపదము లానంద
పదములు శంకరపదముల్ నివాళి
పదములు వాలేశుపదములు గొబ్బి
పదములు వెన్నెలలపదములు”

అది-ఆఱు-రేకుల-పువ్వు-తుమ్మెదా-అది మీఱిన వాసనె తుమ్మెదా-అనునది. పండితారాధ్యచరిత-నాదప్రకరణము 173 పుట.

  1. ఓంకారపూర్వో మంత్రో౽యం పంచాతురమయం వరః
    శైవాగమేషు వేదేషు షడక్షరి ఇతి స్మృతః. సిద్ధాంతశిఖామణి.
    ప్రణుతింపఁ బంచాక్షరములకు మొదలఁ
    బ్రణవ మొంద షడక్షరంబు నాఁ బరఁగు. ధీక్షాబోధ-ద్వితీయాశ్వాసము.

    ప్రధమముద్రణమునందు, ఆఱురేకులమంత్ర మన మూలాధార స్వాధిష్ఠాన మణిపూర కానాహత శుద్ధ సహస్రార బ్రహ్మరంధ్రము లని వ్రాయఁబడి ద్వితీయముద్రణమున నాఱురేకులమంత్ర మనఁ బ్రణవాక్షరపూర్వక మగుపంచాక్షరి యని వ్రాయబడియున్నది. ఇందు తొలియర్థము తాంత్రికసంప్రదాయము. రెండవది శైవసంప్రదాయము. ఈసంప్రదాయములు రెండును సోమనాథభాష్యమునను, వీరశైవాష్టావరణప్రమాణాష్ట్రకాభరణమునను వివరింపఁబడి యున్నవి. శైవాగమములు శివలింగ మీషడక్షరీమంత్రరూప మని తెలుపుచున్నవి.