పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/55

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

వాకిళ్లకు, త్రిపురాంతకుఁడు, బ్రహ్మేశ్వరుఁడు, మాహేశ్వరుఁడు, సిద్ధవటేశ్వరుఁడు ననువా రధినేతలు. అందు, తూర్పువాకిలి త్రిపురాంతకమున కధినాథుఁ డగుత్రిపురాంతకదేవునిపై నీయుదాహరణము త్రిపురాంతమహాకవిచే రచియింపఁబడినది. కావున నీగ్రంథమునకుఁ ద్రిపురాంతకోదాహరణ మను పేరు గలిగినది.

తరుణాచల మనఁ గుమారగిరి. త్రిపురాంతకమునొద్ద పర్వతభాగమునకుఁ గుమాగగిరి యనుపేరు. ఈకుమారాద్రికిఁ దూర్పుదెసను రెంటాల మల్లినాథుఁ డనుభక్తుఁడు పండ్రెండవశతాబ్దమున సోపానములఁ గట్టించెను. ఈతఁడు పాల్కురికి సోమనాథుని సమకాలికుఁడు. (చూ. బసవపురాణావతారిక - పుట 3).

పద్యమునఁ బంచాననశబ్దమును కవి బహుళార్థస్ఫోరకముగ నుపయోగించినాఁడు. పైని వివరించిన నాలుగు వాకిండ్ల యధినేతలును, నాదిశృంగ మగుశ్రీశైలాధీశ్వరుఁడు మల్లికార్జున స్వయంభూలింగమూర్తియు నీశ్వరుని పంచముఖములనుండి యుద్భవించినట్లు పండితారాధ్యచరిత్రమున నిట్లు గలదు:--

అద్భుతలీల నయ్యైస్థానములు స
ముద్భవం బయ్యె లింగోపకంఠమున
నొలసి తదీయ్యసద్యోజాతవదన
మలరి బ్రహ్మేశ్వరం బనఁ బశ్చిమమున
వామదేవాంచితవక్త్రంబు బరఁగె
దా మహేశ్వర మనఁ దగ నుత్తరమున
గురుదక్షిణమున నఘోరవక్త్రమున