పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/54

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

55

ఉత్కళిక

.

అడుగుఁదమ్ములఁ జొప్పు వసి గని
యడరి శునకాకృతులు గైకొని
మీఱి చదువులు దవుల ముందటఁ
బాఱుక్రోడము నేసి మందట
లాడి తను మార్కొనఁగవచ్చిన
క్రీడి కోరినవరము లిచ్చిన
యాటవికకులసార్వభౌముఁడు
జూట భాస్వత్తుహినధాముఁడు.

పద్యవివరణము

భారతవర్షమున ద్వాదశజ్యోతిర్లింగములయందు[1] తెలుఁగుదేశమునఁ జిరప్రఖ్యాతిఁ గన్న శ్రీశైలమునకు నాలుగుదెసలను నాలుగువాకిళ్లు గలవు. వానికి దూర్చున త్రిపురాంతకము;

పడమట బ్రహేశ్వరము (అలంపురి); ఉత్తరమున మాహేశ్వరము; దక్షణమున సిద్ధవటము నని పేరులు. ఈనాలుగు

  1. ద్వాదశ జ్యోతిర్లింగములు:--( 1 ) సౌరాష్ట్రమున సోమనాథుఁడు, (2) శ్రీశైలమున మల్లికార్జునుఁడు, (3) ఉజ్జయిని మహాకాళుఁడు, (1) అమరేశ్వరము ఓంకారేశ్వరుఁడు, (5) వారేల్యమున వైద్యనాథుఁడు, (6) దారుక నాగనాథుఁడు, (7) వారణాసి విశ్వేశ్వరుఁడు, (8) దాక్షారామము భీమేశ్వరుఁడు, (9) రామేశ్వరమున రామలింగేశ్వరుఁడు, (10) హిమాలయమున కేదారేశుఁడు, (11) నాసిక త్ర్యంబకేశ్వరుఁడు, (12) ఏలాపురి ధిషణేశ్వరుఁడు. ఈద్వాదశజ్యోతిర్లింగములఁ గూర్చినప్రశంస భారతి, రక్తాక్షి, ఫాల్గునము, 'మార్చి 1925' లోఁ గనఁదగును.