పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/4

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

హృతులవలన నిది త్రిపురాంతకుని కృతిగాఁ దెలియుచున్నది. క్రీ. శ. 16 వ శతాబ్దాదిని ప్రాచీనగ్రంథసంకలనము గావించిన పెదపాటి జగన్నాథకవి తన ప్రబంధరత్నాకరమున దీనిని త్రిపురాంతకునిదనిఁ జెప్పియున్నాఁడు. ఆపైని యప్పకవి వేంకటకవిమున్నగులాక్షణికులు తమగ్రంథముల దీనినిఁ త్రిపురాంతకునిదిగా నుదాహరించియున్నారు. కావున దీనికిఁ గర్త త్రిపురాంతకుఁడనియే నిర్ధారింపఁదగియున్నది. ఇది యిట్లుండ క్రీ. శ. 1938 సంవత్సరమునఁ బ్రకటింపఁబడిన తంజాపురాంధ్రగ్రంథవివరణసూచిక[1] యందు నీగ్రంథమునుఁగూర్చియు గ్రంథకర్తనుఁగూర్చియు నిట్లు వ్రాయఁబడినది.

166. త్రిపురాంతకోదాహరణము.

R సమగ్రము. వ్రాలు చక్కనివి. తప్పులు లేవు. శైథిల్యము లేదు. గ్రంథ పాతముం గన్పట్టదు. “తలఁకి సీనమరాజు దాడికోర్చినవాని” “వరలువరమాసందవనధితీర్థమువలన” అని యీగ్రంథమున నిద్దఱిపేరులు గన్పట్టుచున్నవి. వీరిలో గ్రంథకర్త యీతఁడని నిశ్చయింప వీలుగాకున్నది.

తరువాత నాంగ్లేయభాషలో నిట్లున్నది.

“There is a printed work of the same name attributed to Thripurantaka wheather this manuscript represents the printed work needs examination”

  1. ఆంధ్రవిశ్వకళాపరిషత్ప్రకటితము 1933. ఫుట. 37. (చూ. ఫుట, 37. A Descriptive Catalogue of the Telugu Manuscripts in the Tanjare Mabaraja Serlojis Saraswati Mahal Library.)