పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/3

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

తెప్పించికొని యీముద్రణమున నుపయోగించితిని. దీనిని తొలుత క్రీ. శ. 1918వ సంవత్సరమున సుప్రసిద్ధప్రాచ్యవిద్యాపరిశోధకులు మా రామకృష్ణకవిగారు విస్మృతకవులనుపేరఁ ప్రకటించినగ్రంథావళియం దాఱవదిగ, వెలువరించినారు. అది వనపర్తియందలి బ్రహ్మవిద్యావిలాసముద్రాక్షరశాలలో ముద్రింపఁబడి పీఠిక, లఘుటీకలతో నొప్పుచున్నది.

శ్రీరామకృష్ణకవిగారే దీనిని రెండవతూరి శ్రీతిరుమలవేంకటేశ్వరపత్రికయందు, క్రీ. శ. 1933 సంవత్సరమున నేప్రియలునెలలో బ్రకటించిరి.

పైని వివరించినవిగాక, యీగ్రంథప్రశస్తినిఁ దెలుపుచు నమూల్యమగు తమస్వంతపుఁబ్రతిని నాకు బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రులవారు పంపిరి. వారికి నే నెంతయుఁ గృతజ్ఞుఁడను.

2. గ్రంథకర్తృత్వము

ఈయుదాహరణమునకుఁ గర్త రావిపాటి త్రిపురాంతకుఁడు. ఈ విషయము గ్రంథమునం దెచ్చటను లేకపోయినను [1]నంధ్రవాఙ్మయమున సంకలితలక్షణగ్రంథములలోని యుదా

  1. ఆంధ్రమున ప్రబంధరత్నాకరము, సంస్కృతభాషలో కవీంద్రవచనసముచ్చయము, శార్ఙధరునిపద్ధతి, జల్హణునిసూక్తిముక్తావళి, వల్లభదేవుని సుభాషితావళి మొదలగువానిఁబోలిన సంకలితగ్రంథము. తెనుఁగులో మడికి సింగనసమకూర్చిన సకలనీతిసమ్మతము మొదటిది. ఇది రెండవది. ఇది యముద్రితము. మూఁడాశ్వాసములదనుక తంజావూరుపుస్తకాగారమున గలదు. ఇందపూర్వగ్రంథము లుద్ధరింపఁబడినవి.