పుట:త్రిపురాంతకోదాహరణము.pdf/2

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

భక్తిరసప్రధానమై, యాంధ్రశైవవాఙ్మయమునకు సంబంధించిన లఘుకృతులయం దెన్నికఁగన్న యీయుదాహరణము నేఁటి కించుమించుగ నాఱునూరేండ్లక్రిందట సిరిగిరికిఁ దూర్పువాకిలియగు త్రిపురాంతకమున నెలకొనిన దేవరపేర వెలసినది. సంబుద్ధితో నెనిమిదియగు విభక్తులతో నెనిమిదిపద్యములును, కళికలును, నుత్కళికలును గలిగి భక్తిప్రశంసాపరమగు ప్రబంధభేదమునకు నుదాహరణ మనిపేరు. ఆంధ్రవాఙ్మయమున నుపలబ్ధము లగునట్టి యుదాహరణములలోఁ బండ్రెండవశతాబ్దమునఁ బుట్టిన పాల్కురికి సోమనాథుని బసవోదాహరణము ప్రథమము. త్రిపురాంతకోదాహరణము కాలక్రమమున ద్వితీయమైనను, కవితాప్రకర్షయం దద్వితీయమగుటచే నీవఱకు రెండుతడవలు ముద్రింపఁబడినను మూఁడపతూరి ముద్రణావశ్యకతఁ జేగూర్చినది.

1. పూర్వమాతృకాగ్రంథవివరణము

ఈయుదాహరణమునకు మాతృక తంజావూరున శ్రీ శరభోజిమహారాజ సరస్వతీభవనప్రాచ్యలిఖితగ్రంథభాండారమునందు గలదు. నే నీమాతృకకు సరియగుపుత్రికను[1] వ్రాయించి

  1. దీనిని యథామాతృకముగ వాయించి సకాలమునకు నా కందఁజేసిన తంజావూరు సరస్వతీగ్రంథాలయకార్యనిర్వాహకసంఘ గౌరవ కార్యదర్శులు శ్రీయుత రావుసాహెబు టి. సాంబమూర్తిరావు, బి.ఏ. ఎమ్.ఎల్. గారికి నే నెంతయు గృతజ్ఞుఁడను.