72
తెలుగు వాక్యం
2.84 : వ్యవహారంలో ఏమో, ఓ శబ్దయుక్త వాక్యాలు సామాన్యవాక్యాలుగా (అశ్లిష్ట) కూడా ప్రయోగం అవుతుండై.
(188) | a. సుజాత ఎప్పుడు వస్తుందో: | |
వ్యవహరించే విధానాన్నిబట్టి ఈ పై వాక్యాలు భిన్నార్థకాలు కావచ్చు. ఒక అర్థంలో శ్రోతనుంచి సమాధానాన్ని అపేక్షించే పరోక్ష ప్రశ్నలవుతై. మరో అర్థంలో వక్త తనకు తాను (సమాధానాపేక్ష లేకుండా) వేసుకున్న ప్రశ్నలవుతై. రెండో అర్థంలో పై వాక్యాలను కిందివిధంగాకూడా వ్యవహరించవచ్చు.
| c. సుజాత ఎప్పుడు వస్తుందో ఏమో? | |
మొదటి అర్థంలో ఈ కింది విధంగా వ్యవహరించవచ్చు.
| e. సుజాత ఎప్పుడు వస్తుందో నీకు తెలుసా ? | |
ఈ సూచించిన అర్థభేదం ఉన్నట్టయితే (178) లో (a) (b) లకు క్రమంగా (c, d) లు, (e, f) లు మూలవాక్యాలుగా ప్రతిపాదించటం ద్వారా ఆర్థభేదానిక్కారణం చూపించవచ్చు.
ఆ ప్రశ్నలకీ ఏమో శబ్దానికి ఏ- ప్రశ్నలకీ ఓ- శబ్దానికీ సంబంధం చూపించబడింది. రెండు ఆ- ప్రశ్నలమధ్య వికల్పాన్ని చెప్పినప్పుడు పరోక్ష ప్రశ్నల్లో ఓ- శబ్దమే వస్తుంది.
(189) | a. సుజాత Ph. D. చేస్తుందో, పెళ్ళి చేసుకుంటుందో తెలీదు. | |
2.85 : క్రియకు నిశ్చయ వ్యతిరేకాల మధ్య వికల్పాన్ని చెప్పినప్పుడు వ్యతిరేక క్రియకు లేదు వికల్పంగా ఆదేశం అవుతుంది. క్రియారహిత వాక్యాల్లో స్థితి బోధకాలకు కాదు శబ్దం, పరిణామ బోధకాలకు లేదు ఆ దేశం అవుతుంది. కాలభేదంతో సంబంధం లేకుండానే ఈ ఆదేశం జరుగుతుంది. ఆ ప్రక్రియ ఈ కింది వాక్యాల్లో చూడవచ్చు. ఈ ఆదేశ కార్యాలు పరోక్ష ప్రశ్నల్లోనూ, ప్రత్యక్ష ప్రశ్నల్లోనూ కూడా జరుగుతై.