పుట:తెలుగు వాక్యం.pdf/56

ఈ పుట ఆమోదించబడ్డది

42

తెలుగు వాక్యం

(116) లో (b) భిన్నకర్తృకమైతే వ్యాకరణ నమ్మత మవుతుంది. ప్రధాన వాక్యం ప్రశ్నార్థకమైనా వ్యాకరణ సమ్మతమవుతుంది. హేత్వర్థబోధ ఉన్నప్పుడు. భూతకాలిక క్రియా యోగంలో చేదర్థక వాక్యాలు ఏక కర్తృకతను సహిస్తై.

(117)

సుబ్బారావు కోడిగుడ్లు తింటే బలిశాడు.

హేత్వర్థ బోధలో క్త్వార్థక, చేదర్థక వాక్యాలకు సంబంధముంది. హేత్వర్థ బోధను కలిగించే నియమాలు రెంటికి సమానం.

2.37 : క్రియారహిత వాక్యాలకు చేదర్థయోగంలో అగు ధాతురూపం చేరుతుంది.

(118)

అతడు దిగంబర కవి అయితే బట్టలు వేసుకున్నాడేం?

ఈ పై వాక్యంలో ప్రశ్నార్థక శబ్దం తీసేస్తే (116) (b) లాగా వ్యాకరణ విరుద్ధ మవుతుంది.

చేదర్థక క్రియలున్న వాక్యాల్లో ప్రధాన వాక్యస్థానంలో కేవల ప్రశ్నార్థక శబ్దాలుకూడా వస్తై.

(119)

a. ప్రజలకు తిండి లేకపోతే ఏం?
b. అధికార్లకు సలాములు కొట్టకపోతే ఎట్లా?
C. గుడ్డికన్ను మూస్తే ఎంత? తెరిస్తే ఎంత?

2.38 : క్రియాజన్య విశేషణం మీద అట్టు చేరిస్తే ఏర్పడ్డ నామానికి ఉంటే , అయితే అనే శబ్దాల్లో ఒకదాన్ని చేర్చి చేదర్థకాన్నీ తయారు చేయవచ్చు. అట్లాంటి వాక్యాల్లో ప్రధాన వాక్యంలో క్రియ భూతకాలికం కాగూడదు.

(120)

 a. నువ్వు రేపు పొద్దున వచ్చేట్టుంటే డబ్బిస్తాను.
 b. నువ్వు నిన్న సాయంకాలం వచ్చినట్టుంటే సినిమాకు వెళ్ళేవాళ్ళం.

  • c. నువ్వు నిన్న సాయంకాలం వచ్చినట్టుంటే సినిమాకి వెళ్లాం.

పై వాక్యాల్లో (c) వ్యాకరణ విరుద్ధం.

2.41 : అప్యర్ధకం : ధాతువుకు ఇనా అనే ప్రత్యయాన్ని చేర్చటంవల్ల, అవ్యర్థక క్రియ ఏర్పడుతుంది. రెండు వాక్యాలకు మధ్య నిరనుబంధ బోధకత