పుట:తెలుగు వాక్యం.pdf/38

ఈ పుట ఆమోదించబడ్డది

24

తెలుగు వాక్యం

1.29 : కర్మపదాలు ప్రాణివాచకాలై నపుడు, ద్వితీయావిభక్తి ప్రత్యయ మైన ను, ని లను గ్రహిస్తుంది. ఇవికాక భిన్నార్థాలలో భిన్నవిభక్తి ప్రత్యయాలు నామాలకు చేరుతుంటై. వాటిల్లో కొన్ని ఈ కింది ఉదాహరించబడు తున్నై.

1. కు ; కి : సంబంధార్థం, స్వామ్యార్థం, సంప్రదానార్థం, ప్రయోజనార్థం, గమ్యార్థం.

(50)

a. ఆమెకి ఇద్దరు పిల్లలు.
b. అతనికి రెండిళ్ళున్నై.
c. నీకు పిల్ల నెవరిస్తారు.
d. చల్లకువచ్చి ముంత దాచట మెందుకు ?
e. ఆతను ఊరికి వెళ్ళాడు.

ఇవికాక చాలా చాలా అర్థాలలో ఈ విభక్తి ప్రయోగించబడుతుంది.

(51)

a. నాకు వందరూపాయలు కావాలి.
b. నీకు ఎవరు చెప్పారు?
c. ఆమె పిల్లికి భయపడుతుంది.
d. అతను చలికి వణుకు తున్నాడు.
e. నాకు హిందీ రాదు.
f. రేపు పదిగంటలకు వస్తాను.

2. నుంచి : ఆపాదానార్థం, హేత్వర్థం, ఏకదేశ పృథక్కరణం.

(52)

a. అతను అమెరికానుంచి వచ్చాడు.
b. అతను పదేళ్ళ నుంచి మెడిసిన్ చదువుతున్నాడు.
c. నీనుంచి మాటలు పడాల్సి వచ్చింది.
d. అతను చెట్టునుండి పువ్వులు కోశాడు.

3. తో : కరణార్థం, సహార్థం, రీత్యర్థం, దేహమనఃస్థితి బోధకం.

(53)

a. అతను పెన్సిలుతో పరీక్ష రాసాడు.
b. ఆతను కమలతో పరీక్షకు వెళ్ళాడు.
c. అతను శ్రద్ధతో పాఠాలు చదివాడు.