సామాన్య వాక్యాలు
7
(13) | a. నీకు పిల్లలు ఎంతమంది? | |
మరికొన్ని వాక్యాలలో లోపించిన క్రియ అవు. లాగా కనిపిస్తున్నది. అవి సాధారణంగా సంబంధార్థక బోధకాలు.
(14) | a. అతను నాకు తమ్ముడు. | |
ఈ వాక్యాలలో కాలబోధతో సంబంధం లేకుండా అవుతాడు, అవుతుంది అనే క్రియలను ప్రయోగించవచ్చు. ఇట్లా ప్రయోగించినపుడు కొంత ఆర్థభేద మున్నట్లు కన్పిస్తుంది. ఉదాహరణకి అతను నాకు తమ్ముడు అవుతాడు అన్నప్పుడు అతను నాకు సొంత తమ్ముడు కాదు , వరసకు తమ్ముడవుతాడు అని అర్థం కావచ్చు. ఇది తెలుగువారి చుట్టరికపు పద్ధతివల్ల ఏర్పడిన అర్థభేదం.
1.18 : మరికొన్ని వాక్యాలలో లోపించిన క్రియ ఇంకో వాక్యం నుంచి నిష్పన్న మయినట్లుగా కన్పిస్తుంది. అప్పుడా లోపించిన క్రియ ఆ వాక్యపు గుప్త నిర్మాణాన్ని బట్టి మాత్రమే. చెప్పగలము.
(15) | a. నాకు కాఫీ అలవాటు. | |
ఈ పై వాక్యాలలో తాగటం, చదవటం అనే క్రియలు క్రమంగా లోపించి నట్లు గ్రహించగలం.
1.19 : కొన్ని వాక్యాలలో ఆఖ్యాత పదం విధేయనామంగా కనిపించినా, అర్థాన్ని బట్టి క్రియగానే గుర్తించాల్సి ఉంటుంది.
(16) | a. అతను రోజూ మా యింటికి వచ్చేవాడు. | |
ఈ పై వాక్యాలు పైకి క్రియారహిత వాక్యాలుగా కనిపించినా, వచ్చేవారు, వాయించేది అనే రూపాలు భూతకాలంలో జరిగిన శత్రర్థ వ్యా పారాన్ని సూచిస్తున్నది. అందువల్ల వీటిని క్రియలుగానే గుర్తించాల్సి ఉంటుంది.