4
తెలుగు వాక్యం
| c. గాడిద గాడిదే, గుర్రం గుర్రమే. | |
1.13 : ఈ క్రియారహిత వాక్యాలలో విధేయాలుగా వచ్చిన కొన్ని విశేషణాలు నామాలుగా మారకుండానే ప్రయుక్త మయ్యేవికూడా ఉన్నై. అట్లాంటి విశేషణాలను ఇంతకు ముందు ఉదాహరించిన వాటికన్నా భిన్నంగా గ్రహించాల్సి ఉంటుంది. అటువంటి వాటిల్లో కొన్ని ఈ కింది వాక్యలలో గుర్తించవచ్చు.
(6) | a. ఆ కొండ ఎత్తు. | |
ఈ పై వాక్యాలలో విశేషణాలు నిజానికి విశేషణాలయినా, వీటికి విశేష్యాలుగా ప్రయోగాలు కన్పిస్తున్నై ఉదాహరణకు,
(7) | ఈ బావి లోతు - 6 అడుగులు. | |
కాని పొట్టి అనే విశేషణాన్ని ఈ పై విధంగా ఉపయోగించడానికి వీలు లేదు. ఈ పై విశేషణాలు పదార్థం లేక ద్రవ్యం అవకాశంలో ఆక్రమించే స్థానాన్ని సూచించేవిగా కన్పిస్తున్నాయి. ఈ లక్షణానికి ప్రత్యయరహితంగా విధేయస్థానంలో ఉపయోగించటానికి ఏమైనా సంబంధం ఉందేమో చెప్పటం కష్టం. ఈ క్రియా రహిత వాక్యాలలో తులనాత్మక వాక్యాలు ఇంకోరకం. ఈ వాక్యాలలో 'తో ' 'కంటె' వంటి ప్రత్యయాలు కూడా చేరతై.
(8) | a. అతను నాకంటె పెద్ద. | |